హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Republic Day 2020: జాతీయ పతాకం.. మనం చేయకూడని పనులు..

Republic Day 2020: జాతీయ పతాకం.. మనం చేయకూడని పనులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Republic Day Indian National Flag | త్యాగాన్ని తెలిపే కాషాయం, శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. భావి తరాలకు కానుక మన మువ్వన్నెల జెండా అన్నది తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం

ఇంకా చదవండి ...

1.సూర్యోదయం కంటే ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు.

2.జాతీయ పతాకం ఎట్టి పరిస్థితులలో నేలను తారరాదు, తగలకూడదు. అలాగే తలక్రిందులుగా (ఆకుపచ్చ రంగుపైకి) ఎగురనీయరాదు.

3.జాతీయ పతాకాన్ని అలంకరణంగా గాని, తోరణాలుగా గాని, దుస్తులుగా గాని కుట్టించుకోకూడదు.

వంటి పై ధరించే వస్త్రాలుగా గాని, జాతీయ పతాకం పై ఎలాంటి వ్రాతలు వ్రాయరాదు. దీనిని సంచిలా

వాడుకొనరాదు. అలగే ఏదైనా సమావేశాల వేదికపై కప్పరాదు. ఏదైనా కంపెని వాణిజ్య పరమైన

లాభాల కోసం జాతీయ పతాకాన్ని వాడరాదు.

4.పెను తుఫాన్‌ల సమయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయరాదు.

5.జాతీయ జెండా ఉపయోగానికి పనికి రాకుండా పోతే క్వాషీ జ్యుడిషియల్ అధికారికి తెలిపి వారి

అనుమతి పొంది జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను విడదీయాలి. వారి పరిశీలనకు

అప్పగించాలి.

6.జాతీయ పతాకానికి కుడివైపున గాని, ఎత్తుగా మరే జెండాగాని మరే జాతీయ చిహ్నాం కాని

ఎగురడానికి వీలులేదు.

7.ప్టాస్టిక్ జెండాలను వాడరాదు. ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో కరగదు. కాబట్టి ప్లాస్టిక్‌తో రూపొందించిన

జెండాలను వినియోగిస్తే అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి జాతి గౌరవానికి భంగం కలిగే ప్రమాదం

ఉంది.

8.జెండాలను ఉత్సవం ముగిసిన వెంటనే తీసివేయాలి. వారాలు, నెలలు తరబడి తొలగించనట్లయితే

వాతావరణ మార్పులు, ఇతర కారణాల వల్ల అవి చిరిగి, ముక్కలై నేలపై పడిపోతాయి. భవనాలు,

స్థంభాలు, కిటీకీలకు అవి అలాగే వేలాడే ప్రమాదముంది.

9.ఉత్సవాల తరువాత కాగితపు జెండాలను నేలపై వదిలివేయకూడదు. పారేయకూడదు.

సాధ్యమైనంత వరకు జాతీయ పతాక గౌరవానికి ఎటువంటి భంగం కలుగని ప్రత్యేక ప్రదేశాలలో వాటిని

ఉంచాలి.

10.జాతీయ పతాకాన్ని అలంకరణ కోసం తోరణంగా, గుండ్రటి బ్యాడ్జిగా, అలంకార వస్తువుగాని, మరే

విధంగా గాను వినియోగించరాదు.

11.విద్యార్థులలో జాతీయ భావాలను, జాతీయ పతాకం పై గౌరవాన్ని పెంపోందించే కార్యక్రమాలను

విద్యాసంస్థలలో చేపట్టేలా పాఠశాల విద్యా సంచాలకులు చర్యలు తీసుకోవాలి.

12.జాతీయ పతాకం ఎగుర వేసే ప్రాంతాలలో ఆదేశాలు, నియమాలు పాటిస్తున్నారో లేదో అధికారులు

పరిశీలించాలి. ఎవరైనా నియమావళిని అతిక్రమిస్తే అవసరమైన చర్యలు తీసుకోవాలి.

13.జాతీయ జెండాను అవమానపరిచే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లేదా జరిమానా

లేదా రెండింటితో కూడిన శిక్షలు వేయవచ్చు. మరిన్ని వివరాలకు జాతీయ గౌరవ చిహ్నాల పరిరక్షణ

(అవమాన నిరోధక) చట్టం-1971లోని నిబంధనలను ఓపిక చేసుకోని చదవాల్సిందే.

ముఖ్యంగా కార్ల మీద :- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని,  సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర కేబినేట్ మంత్రులు గవర్నర్లు, విదేశాలలోని భారత రాయబారులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు..తమ కార్ల మీద జాతీయ పతాకాన్ని ఉంచుకొనవచ్చును.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: National, President of India, Ramnath kovind, Republic Day 2020

ఉత్తమ కథలు