ప్రతీ ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటుంది. ప్రస్తుతం మనం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. భారతదేశమంతా ఎంతో గర్వంగా గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటుంది. దేశరాజధాని నుంచి పల్లెలవరకు ప్రతీ చోట త్రివర్ణ జెండా రెపరెపలాడుతోంది. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డేన పరేడ్ నిర్వహిస్తారు. మరోవైపు స్కూళ్లలో చిన్నారులంతా తమ ప్రతిభను ప్రదర్శింస్తుంటారు. దేశభక్తిని ప్రతిబింబించేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రపంచ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా గణతంత్రాన్ని నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది గూగుల్. దేశ సాంస్కృతిక వారసత్వం, బయో వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా డూడుల్ రూపొందించింది. త్రిడీ వెర్షన్‌లో తయారు చేసిన ఈ డూడుల్‌లో బ్యాక్ డ్రాప్‌లో రాష్ట్రపతి భవన్ కనిపిస్తుంది. చెట్లు, కుతుబ్ మినార్ వంటి వాటిని ప్రత్యేకంగా పొందుపరిచింది. G-O-G-L-E అనే పదాన్ని వివిధ రంగుల్లో అమర్చింది. ప్రతీ ఒక లెటర్ ప్రత్యేక స్టైల్లో ఏర్పాటు చేసి... గోల్ఫ్ కోర్స్ నుంచి ప్రాచీన స్మారక కట్టడం కుతుబ్ మినార్ ప్రతిబింబించేలా రూపొందించింది.
ఇందులో జి ఆకుపచ్చ రంగులో గోల్ఫ్ లింక్‌లా కనిపిస్తుంది. Lలో ఢిల్లీ యొక్క కుతుబ్ మినార్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దేశంలో అత్యధికంగా సందర్శించిన సైట్లలో ఇది ఒకటి. నాల్గవ అక్షరం అయిన G కి, ఒక నెమలి మీద ఉంచిన ఏనుగు తొండం ప్రతిబింబిస్తుంది. ఈ రెండు కూడా భారతదేశం యొక్క చిహ్నాలు. మిగిలిన రెండు O లు, E భారతదేశం యొక్క హస్తకళ, వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మొత్తం మీద దేశ సాంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా గూగుల్ రూపొందించిన రిబప్లిక్ డే స్పెషల్ డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google Doodle, National