ప్రముఖ నటి రజితతో సన్నిహితంగా మెలగటంతో వార్తల్లో నిలిచిన నిత్యానంద(Nithyananda) స్వామీజీ మీకు గుర్తున్నారా? తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి అతని ప్రతినిధులు ఇండియా (India)పై ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. కొన్నేళ్ల క్రితం దేశంలో ఆయన చేసిన ఘనకార్యాలకు అత్యాచారం, అపహరణ తదితర కేసులు నమోదు చేశారు. ఆయన ఆశ్రమాన్ని తనిఖీ చేయడంతో పాటు ఇద్దరు, ముగ్గురు మేనేజర్లను అరెస్టు చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ చేశారు. అప్పుడు నిత్యానంద పేరు ఒక సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆయన ఇండియా వదిలి పారిపోయారు.
ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపానికి వెళ్లి ‘కైలాస’ (Kailasa) పేరుతో సొంత దేశాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తమకంటూ సొంతంగా జాతీయ పతాకం, పాస్‌పోర్ట్, కరెన్సీ వంటివి సృష్టించుకున్నారు. తమ గురించి బయట ప్రపంచానికి తెలిసేలా ఓ వెబ్‌సైట్ కూడా తయారుచేశారు. అందులో పెట్టిన ఓ వీడియోతో ఇండియాలో మళ్లీ నిత్యానంద పేరు వినిపిస్తోంది.
* ఐక్యరాజ్య సమితిలో
అందులో పెట్టిన వీడియో ప్రకారం.. కైలాస దేశానికి చెందిన ఇద్దరు మహిళా ప్రతినిధులు జెనీవాలో ఇటీవల జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR)లో పాల్గొన్నారు. అందులో ఒకరు ఆమెను విజయప్రియగా పరిచయం చేసుకున్నారు. కైలాస దేశం నుంచి యూఎన్ సమావేశాలకు శాశ్వత ప్రతినిధిని అని తెలిపారు. అందులో ఆమె హిందూ సంప్రదాయం ప్రకారం చీర, నగలు ధరించి, కుంకుమ ధరించారు. తలపాగా పెట్టుకుని ఎంతో విభిన్నంగా కనిపించారు.
USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8
— KAILASA's SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023
ఆమె కైలాస దేశం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో హిందూ జనాభా తగ్గిపోతుందని అందుకే స్వామి నిత్యానంద కైలాను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తమది మొట్టమొదటి సార్వభౌమాధికార హిందూ దేశమని అన్నారు. హిందూమంతంలో సుమారు 10,000 వేల సంప్రదాయాలు ఉండగా ఆది శైవ దేశీయ వ్యవసాయ తెగలతో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. అక్కడున్న వారందరికీ నిత్యానంద అత్యున్నత గురువుని తెలియజేశారు. ఈ వివరాలన్నీ కైలాస అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : 5 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. రెడ్‌మీ ప్లాన్ అదుర్స్ అంతే!
* భారత్‌పై విమర్శలు
వాళ్ల ఉనికి గురించి మాట్లాడుతూనే ఇండియాపై కొన్ని ఆరోపణలు చేశారు. భారత్ ప్రభుత్వం నిత్యానందను వేధిస్తోందని, ఆయనపై అనేక కేసులు నమోదు చేశారని, సొంత దేశంలోనే ఆయన బహిష్కరణకు గురయ్యారనేది ఆమె వాదన. మరొక ప్రతినిధి మాట్లాడుతూ తమ గురువు ఎదుర్కొంటున్న ఆరోపణలపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఆమె మాట్లాడారు. కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించాలని నిత్యానంద గతంలో ఐక్యరాజ్య సమితిని కోరారు. ఆ తర్వాత దానికి సంబంధించిన వార్తలు ఏవీ లేవు. తాజాగా ఆ దేశ ప్రతినిధులుగా ఇద్దరు యూఎన్ కీలక సమావేశంలో పాల్గొనడం అంతటా చర్చకు దారితీసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, International news, National News