Bhagat Singh Birth Anniversary: అతడే ఓ సైన్యం... బ్రిటిషర్లకు సింహ స్వప్నం భగత్ సింగ్

Bhagat Singh Birth Anniversary: భగత్ సింగ్... ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. చురకత్తి లాంటి అతడు బ్రిటిషర్ల గుండెల్లో నిద్రపోయాడు. సింహ స్వప్నంలా మారి... హడలెత్తించాడు.

news18-telugu
Updated: September 28, 2020, 10:29 AM IST
Bhagat Singh Birth Anniversary: అతడే ఓ సైన్యం... బ్రిటిషర్లకు సింహ స్వప్నం భగత్ సింగ్
Bhagat Singh Birth Anniversary: అతడే ఓ సైన్యం... బ్రిటిషర్లకు సింహ స్వప్నం భగత్ సింగ్
  • Share this:
Bhagat Singh Birth Anniversary: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో... భగత్ సింగ్ చరిత్ర ఆద్యంతం చైతన్య పూరితం. నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన వారు... భగత్ సింగ్ చరిత్ర చదివి చాలు... చటుక్కున లేస్తారు. పులిలా గర్జిస్తారు. అలాంటి అత్యంత పవర్ ఫుల్ విప్లవోద్యమకారుడు షహీద్ భగత్ సింగ్. ఇవాళ ఆ మహనీయుడి జయంతి. ఆ సందర్భంగా... ఆయన మన భరతమాతకు చేసిన సేవను, త్యాగాన్ని గుర్తుచేసుకుందాం. బ్రిటీష్ ఇండియాలో... పంజాబ్ ప్రావిన్స్‌లో... కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు భగత్ సింగ్. తను పుట్టిన రోజునే... తన తండ్రి, మరో ఇద్దరు అంకుల్స్‌ అజిత్ సింగ్, స్వరణ్ సింగ్‌లు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇండియాలో పిల్లల నుంచి ముసలివారి వరకూ... ఎవరైనా విప్లవ వీరుడి పేరు చెప్పమంటే... తడుముకోకుండా భగత్ సింగ్ అని చెబుతారు. 1907 సెప్టెంబర్ 28న... బంగా అనే చిన్న ఊరిలో జన్మించాడు భగత్ సింగ్. దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడి... 23 ఏళ్ల వయసులోనే అమరుడయ్యాడు. మన గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆ దుర్మార్గపు బ్రిటిషర్లు... 1931 మార్చి 23న భగత్ సింగ్‌ను తన స్నేహితులన రాజ్ గురు, సుఖదేవ్‌తో కలిపి ఉరి తీశారు. బ్రిటీష్ ఇండియాకి ఎదురు తిరిగినందుకు అంత పని చేశారు. దేశానికి స్వాతంత్ర్యోద్యమ ఊపిరులు ఊదడమే టార్గెట్‌గా చెలరేగిన భగత్ సింగ్... ఉరి తీస్తున్న క్షణంలో కూడా... చెరగని చిరునవ్వుతో... బ్రిటిషర్లకు పిచ్చెక్కించాడు.


భగత్ సింగ్ కుటుంబం రాజకీయాలలో ఎంతో క్రియాశీలంగా ఉంది. చిన్నప్పుడు భగత్ సింగ్... దయానంద అంగ్లో-వేదిక్ హైస్కూల్లో చదివాడు. అదో ఆర్య సమాజ సంస్థ. అందువల్ల ఆర్య సమాజ సిద్ధాంతాలు... అతని జీవితంపై బాగా ప్రభావం చూపాయి. 1919లో జరిగిందో ఘటన. 12 ఏళ్ల వయసప్పుడు భగత్ సింగ్ జలియన్ వాలాబాగ్ వెళ్లాడు. అక్కడ భారతీయులపై జరిగిన ఊచకోతను కళ్లారా చూశాడు. రక్తం కుతకుతా ఉడికిపోయింది. 14 ఏళ్లప్పుడు... తన ఊరిలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడు. "రేయ్" అంటూ రెచ్చిపోయాడు. ఇక అప్పటి నుంచి అదే దూకుడు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎనీటైం, ఎనీ ప్లేస్... భగత్ సింగ్ ఉంటే... భగభగలే.


ఆ తర్వాత యంగ్ రివల్యూషనరీ మూమెంట్‌లో చేరాడు. బ్రిటీష్ ప్రభుత్వంపై హిసాత్మక చర్యలకు మద్దతిచ్చాడు. 1923లో సింగ్... లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరాడు. అదిరిపోయేలా చదివేవాడు. బ్రిలియంట్ స్టూడెంట్ అనిపించుకున్నాడు. ఎన్నో అవార్డులు అలా వచ్చి వరించాయి. తోటి విద్యార్థులంతా... అతన్ని చూసి... మేమూ నీలా ఉండాలి అనుకునేవారు.

1926 మార్చిలో... భగత్ సింగ్... ఇండియన్ సోషలిస్ట్ యూత్ ఆర్గనైజేషన్ నవజవాన్ భారత్ సభను స్థాపించాడు. ఇంటలీలో యూత్ స్థాపించిన గుస్సెప్పే మజ్జినీ ప్రేరణగా ఈ సంస్థను స్థాపించాడు. చాలా పత్రికలకు వ్యాసాలు రాశాడు. ఎంతో విప్లవ కారులతో కలిసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు. ఓ ఏజ్ రాగానే... ప్రేమా, దోమా... పెళ్లి పిల్లలు అనుకోవడం సహజం. భగత్ సింగ్ మాత్రం... అణువణువూ... దేశ భక్తితో నింపేసుకున్నాడు. పెళ్లి మాటే ఉండేది కాదు అతని జీవితంలో. ఎప్పుడూ దేశం కోసమే శ్రమిస్తూ... ఆ పోరాటంలోనే అమరుడయ్యాడు. అందుకే... భగత్ సింగ్ అంటే... యువతకు ఓ ప్రేరణ, ఓ ధైర్యం, ఓ సాహసం, ఓ నిప్పు కణిక... ఓ ఉప్పెన, ఓ పిడికిలి, ఓ చొరవ, ఓ సైన్యం... ఇలా ఎన్నో.
Published by: Krishna Kumar N
First published: September 28, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading