తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

2014, డిసెంబరు 31కి ముందు.. భారత్‌కు వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశీ మైనార్టీలకు మనదేశ పౌరసత్వం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు మోదీ.


Updated: February 6, 2020, 7:52 PM IST
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజ్యసభలో ప్రధాని మోదీ
  • Share this:
రాజ్యసభలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్షాలను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజనపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నియమ నిబంధనలు, సంప్రదాయాలకు లోబడే చట్టాలను చేశామని.. పార్లమెంట్‌లో అర్ధవంతమైన చర్చ జరిగిందని చెప్పారు మోదీ. ఈ సందర్భంగా లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు (ఏపీ పునర్విభజన బిల్లు) ప్రవేశపెట్టినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు.

''తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సభలో చోటు చేసుకున్న పరిణామాలను ఎవరూ మరచిపోలేరు. పార్లమెంట్ తలుపులు మూసేసి, టీవీ లైవ్ టెలికాస్ట్ ఆపేసి...ఉద్రిక్తతల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన యూఏపీ తీరును ప్రజలంతా చూశారు. సభలో తెలంగాణ గురించి కనీసం చర్చ జరగలేదు.'' కానీ సీఏఏ, ఆర్టికల్ 370 బిల్లులను అలా ప్రవేశపెట్టలేదని తెలిపారు ప్రధాని మోదీ. కేరళ సీఎం పినరయి విజయన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని.. కేరళలో సీఏఏ వ్యతిరేక ర్యాలీలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఢిల్లీలో జరిగే ఆందోళనలకు మాత్రం మద్దతిస్తున్నారని విరుచుకుపడ్డారు. 2014, డిసెంబరు 31కి ముందు.. భారత్‌కు వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశీ మైనార్టీలకు మనదేశ పౌరసత్వం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు మోదీ.First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు