సీఎంకు ఊరట.. ఎన్నికలు నిర్వహించండి... ఈసీని కోరిన గవర్నర్...

మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న 9 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఎన్నికల కమిషన్‌ను కోరారు.

news18-telugu
Updated: April 30, 2020, 9:34 PM IST
సీఎంకు ఊరట.. ఎన్నికలు నిర్వహించండి... ఈసీని కోరిన గవర్నర్...
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే
  • Share this:
మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న 9 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఎన్నికల కమిషన్‌ను కోరారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆ ఎన్నికలు పూర్తయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెం ఊరట కలగనుంది. ప్రస్తుతం శాసనసభ, శాసనమండలి దేంట్లోనూ సభ్యుడు కాని ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల లోపు ఏదైనా సభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. ఆయన ఎమ్మెల్సీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓ దశలో ఉద్ధవ్ థాక్రేను నేరుగా ఎమ్మెల్సీగా నామినేట్ చేయాల్సిందిగా గవర్నర్‌ కోషియారీని కోరుతూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అయితే, గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఉద్ధవ్ థాక్రే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఉద్ధవ్ థాక్రే గత ఏడాది నవంబర్ 28న మహారాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఈ ఏడాది మే 28తో ఆయనకు ఆరు నెలల పదవీకాలం పూర్తవుతుంది. ఈ ఆరునెలల్లో ఆయన అసెంబ్లీలోని ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సి ఉంది.
First published: April 30, 2020, 9:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading