news18-telugu
Updated: October 2, 2020, 5:18 PM IST
Reliance: రిలయెన్స్ సంచలనం... 2 గంటల్లో కరోనాను నిర్థారించే RT-PCR కిట్ తయారీ
(ప్రతీకాత్మక చిత్రం)
రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ RT-PCR కిట్ రూపొందించింది. ఈ కిట్‌తో కోవిడ్ 19 సోకిందా లేదా అన్న నిర్ధారణను రెండు గంటల్లో తేల్చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న RT-PCR టెస్ట్ అంటే రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పాలీమెరాస్ చైన్ రియాక్షన్ టెస్ట్ ద్వారా SARS-CoV-2 నుంచి న్యూక్లిక్ యాసిడ్ సేకరించి రోగ నిర్ధారణ చేయడానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయెన్స్ లైఫ్ సైన్సెస్‌లోని కంప్యూటేషనల్ బయాలజిస్టులు భారతదేశంలో సంక్రమించిన SARS-CoV-2 100 పైగా జన్యువులను విశ్లఏషించి RT-PCR కిట్ రూపొందించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో RT-PCR కిట్ గోల్డ్ స్టాండర్డ్‌గా భావిస్తారు. రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన ఈ కిట్‌కు R-Green Kit అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఈ కిట్ పనితీరుపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు రిలయెన్స్ వర్గాలు తెలిపాయి. SARS COV2 వైరస్‌కు చెందిన E-gene, R-gene, RdRp gene ఉనికిని యాక్టిన్ ద్వారా కనిపెడుతుంది. ఐసీఎంఆర్ ఫలితాల ప్రకారం ఈ కిట్ 98.7 శాతం సున్నితత్వం, 98.8 శాతం విశిష్టతను కలిగి ఉండటం విశేషం.
HDFC Festive Treats: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్SBI Loan EMI: ఎస్బీఐలో లోన్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌తో ఇక ఈఎంఐ టెన్షన్ ఉండదు
రిలయెన్స్ లైఫ్ సైన్సెస్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఈ కిట్ తయారు చేయడం విశేషం. ఇక ఈ కిట్ ద్వారా ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఉపయోగించడానికి చాలా సులువు. రోగ నిర్ధారణ కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. ఇక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరణాల రేటు 2020 చివరి నాటికి గణనీయంగా తగ్గుతుందని రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ నిర్వహించిన మరో అధ్యయనంలో తేలింది. క్లస్టర్ 1, క్లస్టర్ 3 దేశాల కన్నా క్లస్టర్ 2 దేశాల్లో మరణాల రేటు ఆలస్యంగా బలహీనపడుతుందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక మరణాన్ని వాయిదా వేసే లేదా ఆలస్యం చేసే జన్యుపరంగా మార్పు చెందిన మైక్రోఅల్గేకు రిలయెన్స్ యూఎస్ పేటెంట్ సంపాదించింది. సెప్టెంబర్ 8న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ లభించింది.
Published by:
Santhosh Kumar S
First published:
October 2, 2020, 5:18 PM IST