Home /News /national /

RELIANCE INDUSTRIES CONDEMNS REPORTS NITA AMBANI JOINING BHU AS A FACULTY SK

BHU ఫ్యాకల్టీగా నీతా అంబానీ అంటూ ప్రచారం.. ఖండించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

నీతా అంబానీ

నీతా అంబానీ

నీతా అంబానీ గురించి వస్తున్న వార్తలు నిరాధారమైనవని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు రాలేదని, బెనరాస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని వెల్లడించింది.

    రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రఖ్యాత విశ్వ విద్యాలయం బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) విజిటింగ్ ప్రొఫెసర్లుగా నీతా అంబానీతో పాటు గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీని నియమించబోతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల 40 మంది విద్యార్థులు సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అండ్ డెవలప్‌మెంట్‌‌లో వైస్‌ చాన్స్‌లర్‌ రాకేశ్‌ భట్నాగర్‌ ఆధ్వర్యంలో నీతా అంబానీ పేరును ప్రతిపాదించినట్లు కథనాలు ప్రసారమయ్యాయి. దాంతో పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ గురించి వస్తున్న వార్తలపై రియలన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది.


    నీతా అంబానీపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలేవీ రాలేదని, బెనరాస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని రియలన్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ANI వార్తా సంస్థ పేర్కొంది. నీతా అంబానీని విజింటింగ్ ప్రొఫెసర్‌గా నియమించినట్లు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా స్పష్టం చేసింది.



    కాగా, బీహెచ్‌యూ సోషల్ సైన్సెస్ విభాగం విజిటింగ్ లెక్చరర్‌గా నీతా అంబానీని నియమించాలని BHU‌ అధికారులకు ప్రతిపాదలను పంపినట్లు కమిటీ కో ఆర్డినేటర్ కోఆర్డినేటర్‌ నిధిశర్మ తెలిపారు. ఆమె మహిళా పారిశ్రామికవేత్త, ఫ్యాకల్టీగా చేరితో పూర్వాంచల్‌కు చెందిన మహిళలు తన అనుభవంతో ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఐతే ఆ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు బీహెచ్‌యూలో ఆందోళనలు చేసినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ విజిటింగ్ లెక్చర్‌గా నియమించాల్సిందిగా ఎవరూ ప్రతిపాదించలేదని స్వయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేయడంతో.. ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Nita Ambani, Reliance, Varanasi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు