హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

జియోవండర్‌ల్యాండ్‌లో రిలయన్స్ ఫౌండషన్ క్రిస్‌మస్ వేడుకలు...4000 మంది చిన్నారులకు ప్రత్యేక ప్రివ్యూ...

జియోవండర్‌ల్యాండ్‌లో రిలయన్స్ ఫౌండషన్ క్రిస్‌మస్ వేడుకలు...4000 మంది చిన్నారులకు ప్రత్యేక ప్రివ్యూ...

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, ఈశా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, ఈశా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ బుధవారం జియో వండర్ ల్యాండ్ లో 4000 మంది అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలతో కలిసి క్రిస్ మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జియో వండర్ ల్యాండ్ ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం నింపారు.

ఇంకా చదవండి ...

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ బుధవారం జియో వండర్ ల్యాండ్ లో 4000 మంది అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలతో కలిసి క్రిస్ మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జియో వండర్ ల్యాండ్ ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. క్రిస్ మస్ పండుగ వేళ వారిలో ఉత్సాహాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ప్రివ్యూ దోహదపడింది. ముంబై నగరంలో ఏర్పాటు చేసిన జియో వండర్లాండ్‌లో అంతర్జాతీయ కార్నివాల్స్‌తో పాటు , డ్రోన్ షోలు, గేమ్స్, మేజిక్ యాక్ట్స్, ఫెర్రిస్ వీల్, ట్రామ్పోలిన్ పార్కులు, శాంతా క్లాజ్, ఫోటో బూత్‌లు ప్రత్యేక ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన అభిమాన కామిక్స్ పాత్రలైన హామ్లీస్ ఫ్యామిలీకి చెందిన హామ్లీ, హట్టి ఎలుగుబంటి వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలను మంత్రముగ్దులను చేసేలా నీతా అంబానీ, శాంతా క్లాజ్ వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, ఈశా అంబానీ

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ "ఇది తమకు ఎంతో ఆనందం ఉల్లాసాన్ని కల్పించిందని, ఈ అనుభవం పిల్లలతో మొదటగా పంచుకోవాలని అనుకున్నా అని, పిల్లలు సంపూర్ణ జీవిత దృక్పథానికి అర్హులని ఆమె అన్నారు. అలాగే ప్రతి బిడ్డకు ఆడటానికి హక్కు ఉండాలి రిలయన్స్ ఫౌండేషన్ 4000 మంది నిరుపేద పిల్లలకు కొత్త జియో వండర్ ల్యాండ్‌లో అనుభవించి ఆనందించే అవకాశాన్ని కల్పించడం ఆనందంగా ఉంది" అని ఆమె తెలిపారు.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, ఈశా అంబానీ

ఈ సందర్భంగా నీతా అంబానీ, ఈషా అంబానీ పిరమల్‌తో కలిసి, జియో వండర్‌ల్యాండ్‌ను భారతదేశపు ఎత్తైన స్థిరమైన క్రిస్మస్ చెట్టు ద్వారా ప్రారంభించించారు. 'రీసైకిల్ 4 లైఫ్ క్రిస్మస్ ట్రీ' ఎలన్ గ్రీన్‌గోల్డ్ ఫాబ్రిక్ రిల్‌వుడ్‌తో తయారు చేశారు. ఎలాన్ గ్రీన్‌గోల్డ్ ఫాబ్రిక్ రీసైకిల్ చేసిన పోస్ట్-కన్స్యూమర్ బాటిళ్ల నుండి తయారుచేశారు. రిల్‌వుడ్ తయారీకి ఒక్క చెట్టు కూడా కత్తిరించాల్సిన అవసరం లేదని తబ ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ రీసైకిల్ 4 లైఫ్ క్యాంపెయిన్‌లో భాగంగా రిలయన్స్ ఉద్యోగులు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలకు 'స్వచ్ఛతా హీ సేవ' ద్వారా 78 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థ సీసాల సేకరించారు. దీంతో ఈ చెట్టు తయారీకి ఆ వ్యర్థాలను ఉపయోగించారు. నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ 2012 నుండి బలహీనమైన పిల్లల కోసం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోంది.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, ఈశా అంబానీ

First published:

Tags: Nita Ambani, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు