హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Reliance Foundation Scholarships: పదేళ్లలో 50 వేల మందికి స్కాలర్‌షిప్‌లు.. రిలయన్స్ ఫౌండేషన్ కీలక ప్రకటన

Reliance Foundation Scholarships: పదేళ్లలో 50 వేల మందికి స్కాలర్‌షిప్‌లు.. రిలయన్స్ ఫౌండేషన్ కీలక ప్రకటన

నీతా అంబానీ, ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

నీతా అంబానీ, ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

Reliance Foundation: స్కాలర్‌షిప్‌కు సంబంధించిన నిబద్ధత భారతదేశ యువత సామర్థ్యంపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ శ్రీమతి నీతా అంబానీ అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దివంగత ధీరూభాయ్ అంబానీ 90వ పుట్టినరోజు సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ముఖ్యమైన ప్రకటన చేసింది. 2022-23 సంవత్సరంలో రిలయన్స్ ఫౌండేషన్(Reliance Foundation) ద్వారా 5000 యూజీ, 100 పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనుంది. వచ్చే పదేళ్లలో 50,000 మందికి స్కాలర్‌షిప్‌లు (Scholarships) ఇస్తామని ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ కింద అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వబడుతుంది. విద్యార్థులకు వారి మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆరు లక్షల రూపాయల వరకు స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. వీరికి మెరిట్ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది.

ఇంజినీరింగ్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ విభాగాల్లో పీజీ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఫిబ్రవరి 2023. స్కాలర్‌షిప్‌కు సంబంధించిన నిబద్ధత భారతదేశ యువత సామర్థ్యంపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ శ్రీమతి నీతా అంబానీ(Nita Ambani) అన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద దాతృత్వ సంస్థలలో ఒకటి అని ఆమె తెలిపారు.

భారతదేశ జనాభాలో సగం మంది లేదా 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయులు 25 ఏళ్లలోపు వారే. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలో ఉన్నత విద్యను పొందేందుకు యువతను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. ఈ సంవత్సరం రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ మెరిట్-కమ్-మీన్స్ ప్రమాణాల ఆధారంగా 5,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకుందని నీతా అంబానీ తెలిపారు.

Aadhar-Pan Link: మీ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేశారా ? లేదా ?.. తెలుసుకోండి ఇలా..

Interest Rates: కొత్త ఏడాదికి ముందు కస్టమర్లకు భారీ శుభవార్త అందించిన బ్యాంక్.. ఈరోజు నుంచి..

రూ. 15 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన విద్యార్థులు తమ అండర్‌గ్రాడ్యుయేట్‌లో మొదటి సంవత్సరంలో చేరి తమకు నచ్చిన ఏదైనా సబ్జెక్ట్ స్ట్రీమ్‌ను అభ్యసించవచ్చని రిలయన్స్ ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని లక్ష్యంగా చేసుకుంటుంది.

First published:

Tags: Nita Ambani, Reliance Foundation

ఉత్తమ కథలు