RELIANCE EMPLOYEES GIVE NEW LIFE TO WASTE PLASTIC BOTTLES COLLECT RECORD SETTING 78 TONS OF WASTE PLASTIC MK
Reliance Foundation: స్వచ్ఛతా హీ సేవలో రిలయన్స్ ఫౌండేషన్‌కు మరో ఘనకీర్తి...
Reliance Foundation: "స్వచ్ఛతా హీ సేవ"లో రిలయన్స్ ఫౌండేషన్ మరో ఘనకీర్తి...
పర్యావరణ పరిరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని అందుకు కోసం రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి ఉందని సంస్థ చైర్ పర్సన్ నీతా అంబానీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన "స్వచ్ఛతా హీ సేవా" నినాదం మేరకు రిలయన్స్ ఫౌండేషన్ స్పందించింది.
పర్యావరణ పరిరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని అందుకు కోసం రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి ఉందని సంస్థ చైర్ పర్సన్ నీతా అంబానీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన "స్వచ్ఛతా హీ సేవా" నినాదం మేరకు రిలయన్స్ ఫౌండేషన్ స్పందించింది. ఇందులో భాగంగా పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నడుం బిగించింది. ఇందులో భాగంగా శుక్రవారం రిసైకిల్ ఫర్ లైఫ్ కాంపెయిన్ పేరిట వాలంటీర్ల ద్వారా 78 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించింది. వీటిని రీసైక్లింగ్ ప్రక్రియలో దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులు, అలాగే జియో, రిలయన్స్ రిటైల్ తదితర భాగస్వామ్య సంస్థల ఉద్యోగులు ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అక్టోబర్ నెల మొత్తం ఈ కాంపెయిన్ కొనసాగింది. హరిత ప్రపంచాన్ని కాపాడటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తెలిపారు. స్వచ్ఛతాహీ సేవా నినాదాన్ని కార్యరూపం దాల్చేలా చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ కృషి చేస్తుందని నీతా అంబానీ తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.