అంత్యక్రియల్లో నీళ్లు తాగిన చనిపోయిన వ్యక్తి.. ఆస్పత్రికి తరలించడంతో..

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంబ్లే.. శుక్రవారం గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

news18-telugu
Updated: July 26, 2020, 7:36 AM IST
అంత్యక్రియల్లో నీళ్లు తాగిన చనిపోయిన వ్యక్తి.. ఆస్పత్రికి తరలించడంతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి చనిపోయాడు. అంతిమసంస్కరాలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో చివరి క్రతువులో నోటిలో నీళ్లు పోశారు. చనిపోయిన వ్యక్తి ఆ నీటిని తాగినట్టు బంధువు ఒకరు గుర్తించారు. ఆ విషయం బంధువులందరికీ చెప్పడంతో చనిపోయిన వ్యక్తి బతికి ఉన్నాడని ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు పరీక్షించి అతడి బతికి లేడని, చనిపోయాడని చెప్పడంతో వారి తిరిగి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక హుబ్లీలోని దర్వాడ ప్రాంతంలో ఇరానా కాంబ్లే అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నా. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంబ్లే.. శుక్రవారం గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దీంతో బంధువులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

అందులో భాగంగానే మృతదేహానికి స్నానం చేయించారు. ఈ క్రమంలో ఓ బంధువు నోటిలో నీరు పోయగా వాటిని తాగినట్టు గుర్తించాడు. అంతే కాంబ్లే బతికే ఉండొచ్చని బంధువులు భావించారు. వెంటనే ఎంతో ఆశతో ధార్వాడలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు పరీక్షించి.. అతడి మరణించాడని చెప్పారు. దీంతో తిరిగి మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. బతికే ఉన్నాడని ఆశతో వెళ్లిన వారికి నిరాశే ఎదురయ్యింది. తిరిగి ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Published by: Narsimha Badhini
First published: July 26, 2020, 7:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading