అర్ధ నగ్నంగా రెహానా ఫాతిమా.. బాడీపై బొమ్మలు వేసిన పిల్లలు

ప్రస్తుతం ఆ వీడియోపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. చిన్న పిల్లలతో అలాగేనా ఉండేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై పోక్సో చట్ట కింద కేసు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: June 23, 2020, 10:43 PM IST
అర్ధ నగ్నంగా రెహానా ఫాతిమా.. బాడీపై బొమ్మలు వేసిన పిల్లలు
రెహానా ఫాతిమా
  • Share this:
కేరళ మహిళా ఉద్యమ నేత రెహానా ఫాతిమా తరచూ వివాదాల్లో ఉంటారు. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి రచ్చ చేసిన రెహానా.. ఇప్పుడు మరో వివాదంలో నిలిచారు. రెహానా ఫాతిమా అర్ధ నగ్నంగా కనిపించిన ఓ వీడియో ఒకటి సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రెహానా ఫామితా అర్ధ నగ్నంగా కనిపించగా.. బాడీపై తన ఇద్దరు పిల్లలు పెయింటింగ్ వేశారు. వాటర్ పెయింట్స్‌తో ఆమె కూతురు, కుమారుడు అందమైన చిత్రాలు గీశారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరిట ఆమె యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ''కంటి సమస్యతో బాధపడుతున్న తల్లి విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రం వేసి కూల్ చేశారు.'' అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియోపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. చిన్న పిల్లలతో అలాగేనా ఉండేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై పోక్సో చట్ట కింద కేసు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంకొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. అందులో తప్పేముందని రెహాహానకు బాసటగా నిలుస్తున్నారు.
First published: June 23, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading