Post Covid: కరోనా నుంచి కోలుకున్నారా? ఐనా ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించండి​

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి జీవనశైలిని కొనసాగించాలి? ఏ రకమైన ఆహారం పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను తెలుసుకోండి.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తుంది. రోజుకు సుమారు మూడు లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. అయితే, దేశంలో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. చాలా మంది 14 రోజుల హోమ్​ క్యారెంటైన్​లో ఉండి కోలుకుంటున్నారు. ఇక తీవ్ర లక్షణాలున్న వారు ఆసుపత్రి లేదా కోవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్నామని నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు. చాలా మంది కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆందోళన, బలహీనత, దగ్గు వంటివి అనుభవించే అవకాశం ఉంది. అందువల్ల, కోవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి జీవనశైలిని కొనసాగించాలి? ఏ రకమైన ఆహారం పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను తెలుసుకోండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

1. కరోనా లక్షణలు ఉన్నవారు 14 రోజుల పాటు హోమ్​ ఐసోలేషన్​లో ఉంటే సరిపోతుంది. మొదటి 10 రోజుల్లో నెమ్మదిగా లక్షణాలు బలహీనపడతాయి. హోమ్​ ఐసోలేషన్ కాలం ముగిసిన తర్వాత టెస్ట్​ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అనుమానం ఉంటేనే టెస్ట్​కు వెళ్లండి.

2. కరోనా నుంచి కోలుకున్నాక పల్స్ ఆక్సిమీటర్​ ఉపయోగించి ప్రతి రోజు ఆక్సిజన్ లెవల్​ చెక్​ చేసుకోండి. మీ ఆక్సిజన్​ శాచురేషన్​ లెవల్​ 94% కంటే ఎక్కువగా ఉండాలి.

3. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోండి.

4. ప్రతి రోజు మీ బాడీ టెంపరేచర్​ చెక్​ చేసుకోండి.

5. బద్ధకం, ఒళ్లు నొప్పులు, సెన్సోరియం వంటి సంకేతాలు ఉంటే అప్రమత్తం కావాలి. డాక్టర్ల సలహాతో అవసరమైన మందులు తీసుకోండి.

6. డయాబెటిక్ వ్యాధిగ్రస్థులైతే రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా మానిటరింగ్​ చేయండి. కరోనా సంక్రమణ తర్వాత బాధితుల రక్తంలో చక్కెర స్థాయిని మారుతుంది. అందువల్ల, ప్రతి మూడు రోజులకు ఒకసారి దీన్ని చెక్​ చేసుకోండి. అంతేకాక, క్రమం తప్పకుండా మీ డాక్టర్​ను సంప్రదించండి.

7. రక్తపోటు సంబంధిత సమస్యలుంటే వాటిని నివారించడానికి క్రమం తప్పకుండా రక్తపోటును మానిటరింగ్​ చేసుకోవాలి.

8. మీ శరీరంలో ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించేందుకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోండి. కోవిడ్​ నుంచి కోలుకున్న వెంటనే మీ ఆఫీస్​ వర్క్​ ప్రారంభించకండి.

9. నీరు, కొబ్బరి నీరు, రసాలు, సూప్, నీరు బాగా ఉండే పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోండి. నీరు బాగా ఉండే పండ్లు మీ శరీరంలో హైడ్రేషన్​ను పెంచుతాయని గుర్తుంచుకోండి.

10. పాలు, కాటేజ్ చీజ్, వేరుశెనగ, పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

11. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా యోగా, బ్రీతింగ్​ ఎక్సర్​సైజెస్​, ధ్యానం చేయండి.

12. అవసరానికి మించి వ్యాయామాలు చేయవద్దు. ఎందుకంటే ఎక్కువ శ్రమ వల్ల ఆక్సిజన్ ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి, తేలికపాటి వ్యాయామాలకే ప్రాధాన్యతనివ్వండి. అదేవిధంగా ఆక్సిజన్ డిమాండ్ తగ్గడానికి సరైన విశ్రాంతి తీసుకోండి.

13. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయిన 7 రోజుల్లో జ్వరం, భరించలేని దగ్గు లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ డాక్టర్​ను సంప్రదించండి.

14. వైద్యుడి సలహా మేరకు సిబిసి బ్లడ్​ టెస్ట్ చేయించుకోండి.

15. మీ వైద్యుడి సలహా మేరకు, కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత చెస్ట్​ CT స్కాన్ చేయించుకోండి.
,
Published by:Shiva Kumar Addula
First published: