కొనసాగుతున్న కర్నాటకం... మరికొన్నాళ్లు కుమారస్వామికే ఛాన్స్

Karnataka Politics : మలుపులు తిరగందే అది కర్ణాటక రాజకీయం కాదేమో. అధికారం చేపట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ బీజేపీ అడుగులు ముందుకు వెయ్యట్లేదు. రెబెల్స్ రాజీనామాల అంశం తేలాకే రంగంలోకి దిగాలనుకుంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 25, 2019, 5:45 AM IST
కొనసాగుతున్న కర్నాటకం... మరికొన్నాళ్లు కుమారస్వామికే ఛాన్స్
కుమారస్వామి
  • Share this:
నాటకీయ పరిణామాల మధ్య... బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని ముంబైలో తిష్టవేసిన కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు... అక్కడి రిసార్టుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు అసెంబ్లీకి రాకపోవడంతో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. వాళ్లు కోరుకున్నదే జరిగినప్పటికీ... ఇంకా ముంబైలోనే ఉంటూ... మూడు వారాల వరకూ వచ్చేది లేదని స్పీకర్‌కి చెప్పేశారు. మరి స్పీకర్ ఏం చేస్తారు. రెబెల్స్ ఇచ్చిన రాజీనామాల ఆమోదంపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్ అయ్యింది. రాజీనామాలు ఆమోదిస్తే... వెంటనే తనకున్న పూర్తి మద్దతుతో... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవకాశాలుంటాయి. అదే రాజీనామాలు ఆమోదించకుండా... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... రెబెల్ ఎమ్మెల్యేలు... తిరిగి కాంగ్రెస్, జేడీఎస్ వైపు మొగ్గితే... అది బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుంది. అందుకే బీజేపీ కంగారు పడట్లేదు. రాజీనామాలు ఆమోదించిన తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనుకుంటోంది. ఫలితంగా అప్పటివరకూ కుమారస్వామే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఐతే... ఆయన విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి... దాదాపు ఆయన ఓ డమ్మీ సీఎంలా ఉండాల్సిందే.

15 మంది రెబెల్ ఎమ్మెల్యేలలో 12 మంది కాంగ్రెస్ వాళ్లు కాగా... ముగ్గురు జేడీఎస్ నుంచి ఉన్నారు. వీళ్ల మద్దతు కోల్పోవడం వల్లే... కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. వీళ్లను తిరిగి పార్టీల్లోకి రప్పించేందుకు రెండు పార్టీల కీలక నేతలు, ట్రబుల్ షూటర్లూ రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెబెల్స్ మాత్రం ససేమిరా అంటూ ముంబైలోనే మకాం వేశారు. వాళ్లు గనక తిరిగి కాంగ్రెస్, జేడీఎస్‌కి మద్దతు ఇస్తే... తిరిగి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కుమార స్వామికి అవకాశాలుంటాయి. అందుకే స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా... ఎపిసోడ్ సాగదీస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

ప్రభుత్వం కూలిపోగానే... సీఎం సీటు దక్కించుకోవాలనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నాలకు రకరకాలుగా బ్రేకులు పడుతున్నాయి. RSS నేతలు సైతం... కంగారు పడొద్దని చెప్పడంతో... ఆయన వేగంగా అడుగులు వెయ్యలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ హైడ్రామా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశాలున్నాయి. అయితే... ఇటు సంకీర్ణ ప్రభుత్వమూ లేక, అటు బీజేపీ ప్రభుత్వమూ రాక... ఏ విధాన నిర్ణయాలూ తీసుకోవడానికి వీల్లేకుండా పరిపాలన సాగించడం సరైన విధానం కాదంటున్నారు రాజకీయ నిపుణులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే... రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 25, 2019, 5:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading