హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Corona Vaccination: విదేశాలకు సరఫరా చేస్తున్నా భారత్ లో బహిరంగ మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ ను తీసుకురాకపోవడం వెనుక..

Corona Vaccination: విదేశాలకు సరఫరా చేస్తున్నా భారత్ లో బహిరంగ మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ ను తీసుకురాకపోవడం వెనుక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని ఇతర దేశాలకే వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నారు కదా.?, మరి అదే వ్యాక్సిన్ ను భారత్ లో బహిరంగ మార్కెట్లలో వినియోగానికి ఎందుకు తేవడం లేదు? అని చాలా మంది ప్రజల్లో ఓ సందేహం రేకెత్తుతోంది. దీనికి నీతి ఆయోగ్ సభ్యులు సమాధానం ఇచ్చారు. అసలు కారణమేంటో వెల్లడించారు.

ఇంకా చదవండి ...

  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతోంది. కరోనా మహమ్మారి విజృంబించిన సమయంలో సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఆ తర్వాత విడతల వారీగా దేశప్రజలందరికీ వ్యాక్సిన్ ను అందజేస్తామని కేంద్ర సర్కారు చెబుతోంది. వ్యాక్సిన్ రాకతో కరోనాను జయించేశామన్న ధీమా ప్రతి ఒక్క పౌరుడిలోనూ కనిపిస్తోంది. కరోనా టీకా వేసుకునేందుకు మెజార్టీ ప్రజలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో అత్యవసర వినియోగం కోసం రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతిని ఇచ్చారు. వాటిల్లో కొవిషీల్డ్ ఒకటి. సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఈ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ కొత్త సందేహం కోట్లాది మంది ప్రజలను వేధిస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలకే వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నారు కదా.?, మరి అదే వ్యాక్సిన్ ను భారత్ లో బహిరంగ మార్కెట్లలో వినియోగానికి ఎందుకు తేవడం లేదు? అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

  ఇప్పటి వరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను 13 దేశాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, మంగోలియా, మయన్మార్, నేపాల్, బహ్రెయిన్, బ్రెజిల్, మారిటస్, మొరాకో, ఒమన్, సియాచెలీస్, శ్రీలంక దేశాలకు లక్షల సంఖ్యలో కొవిడ్ డోసులను భారత్ ఉచితంగా సరఫరా చేస్తోంది. నిమిషానికి ఐదు వేల డోసులను తయారు చేస్తున్నట్టు సీరమ్ ఇన్సిస్ట్యూట్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకే పంపిస్తున్న ఆ వ్యాక్సిన్ ను భారత్ లో బహిరంగ మార్కెట్లోకి తెస్తే తప్పేంటని, మన దేశ పౌరుల కోసం ఎందుకు బయట మార్కెట్లోకి ఎందుకు వదలడం లేదని వాదనలు వస్తున్నాయి. కిరణ్ మజుమ్దార్ షా అనే ఫార్మా రంగ ప్రముఖులు కూడా ప్రభుత్వాన్ని ఈ విషయమై కోరారు. విదేశాల్లాగా మనకు టీకాల కొరత లేదు కాబట్టి దీన్ని బహిరంగ మార్కెట్లోకి తీసుకురావాలని ఆమె ట్వీట్ చేశారు.

  ఆమె ట్వీట్ కు నీతి ఆయోగ్ సభ్యులు వీకే పౌల్ రిప్లై ఇచ్చారు. ’ప్రతి ఒక్క దేశం కూడా వ్యాక్సిన్ ను ఎవరికి మొదటగా ఇవ్వాలి? ఎవరికి తర్వాత ఇవ్వాలి.? అన్న జాబితాను రూపొందించుకుంది. మనం కూడా అదే ఫాలో అవుతున్నాం. 50 ఏళ్ల వయసులోపు వారయి ఉండి, మీ ఆరోగ్యం మెరుగైన స్థితిలోనే ఉండి ఉంటే కొంచెం ఓపిక చేసుకుని ఆగండి. మీ వంతు వచ్చాక వ్యాక్సిన్ లభిస్తుంది. వ్యాక్సిన్ అత్యవసరం అయిన వాళ్లకు ముందుగా ఇస్తున్నాం.‘ అని వీకే పౌల్ తేల్చిచెప్పారు. అతి త్వరలోనే 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందిస్తామని ఆయన వెల్లడించారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Almonds Health Benefits, Ayurvedic health tips, Corona Possitive, Corona Vaccine, COVID-19 vaccine

  ఉత్తమ కథలు