'శ్రీరాముడు భారతీయుడు కాదు..నేపాలీ'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

నేపాల్ ప్రధాని కేపీ ఓలీ కొన్ని రోజులుగా చెలరేగిపోతున్నారు. భారత భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్ తీసుకొచ్చారు. అంతేకాదు భారత్ వల్లే తమ దేశంలో కరనా కేసులు పెరగడానికి ఇండియానే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: July 13, 2020, 9:36 PM IST
'శ్రీరాముడు భారతీయుడు కాదు..నేపాలీ'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొన్ని రోజులుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది నేపాల్. సరిహద్దు భూభాగాలతో పాటు కరోనా విషయంలోనూ ఇండియాను టార్గెట్ చేస్తోంది. చైనా అండతో రెచ్చిపోతున్న ఆ దేశ ప్రధాని తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలు తమ భూభాగాలన్న కేపీ ఓలీ. ఇప్పుడు ఏకంగా శ్రీరాముడు కూడా తమవాడేనని అంటున్నారు. శ్రీ రాముడు భారతీయుడు కాదని.. నేపాలీ అని పేర్కొన్నారు. అసలైన అయోధ్య నేపాల్‌లో ఉందని స్పష్టం చేశారు.

భారత్‌లో ఉన్నది నకిలీ అయోధ్య. నిజమైన అయోధ్య నేపాల్‌లోని థోరీలో ఉంది. శ్రీ రాముడు నేపాలీ. భారతీయుడు కాదు. రాముడి జన్మభూమి తమదని చెప్పుకుంటూ భారత్ సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోంది.
కేపీ ఓలీ, నేపాల్ ప్రధాని




నేపాల్ ప్రధాని కేపీ ఓలీ కొన్ని రోజులుగా చెలరేగిపోతున్నారు. భారత భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్ తీసుకొచ్చారు. అంతేకాదు భారత్ వల్లే తమ దేశంలో కరనా కేసులు పెరగడానికి ఇండియానే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల భారతీయ న్యూస్ ఛానెళ్లపైనా నిషేధం విధించారు. ఐతే ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఓలీ వల్లే భారత్‌తో నేపాల్ సంబంధాలు దెబ్బతింటున్నాయని.. వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోని కీలక నేతంతా డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 13, 2020, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading