HOME »NEWS »NATIONAL »ready for open debate on the state of education with ups ministers says delhi manish sisodia sk

Delhi vs UP: యూపీలో ఆమాద్మీదే అధికారం.. బీజేపీకి ఢిల్లీ మంత్రి సవాల్

Delhi vs UP: యూపీలో ఆమాద్మీదే అధికారం.. బీజేపీకి ఢిల్లీ మంత్రి సవాల్
మనీష్ సిసోడియా

యూపీలో విద్యావ్యవస్థ దారుణమైన స్థితిలో ఉందని మనీష్ సిసోయిడా మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకంలో చపాతీ ఉప్పు పెట్టిన ఘనత మీదేనని బీజేపీపై ధ్వజమెత్తారు. చాలా స్కూళ్లు పశువుల దొడ్లుగా మారాయని సాక్షాత్తు నీతి ఆయోగే ధృవీకరించిందని విమర్శించారు.

  • Share this:
    ఉత్తర్ ప్రదేశ్  (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరదీసింది ఆమాద్మీ పార్టీ (AAP). అంతేకాదు యూపీలో ఖచ్చితంగా ఫ్రభుత్వాన్నిఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. యూపీలోని విద్యా, ఆరోగ్య వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి మనీష్ సిసోడియా (Manish sisodia) అన్నారు. డిసెంబరు 22న లక్నోకు వస్తున్నానని.. ఢిల్లీలో విద్యా ప్రమాణాలు, యూపీలో విద్య వ్యవస్థ గురించి చర్చకు సిద్ధమనని తెలిపారు. యూపీ మంత్రులకు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడే ఎవరి ప్రభుత్వం ఏ చేస్తుందో.. ప్రజలకు తెలుస్తుందన్నారు సిసోడియా.

    ఢిల్లీలో వర్చువల్ వేదికగా మీడియాతో మాట్లాడిన మనీష్ సిసోడియా..  ''వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పోటీచేస్తుందని మా పార్టీ నేత కేజ్రీవాల్ ప్రకటించారు. యూపీలో ప్రజారోగ్యం, తాగునీరు, విద్యుత్ సమస్యలు దారుణంగా ఉన్నాయి.   యూపీలలో 70 ఏళ్లలో తొలిసారి విద్యావ్యవస్థ గురించి మంత్రి మాట్లాడుతున్నారు. ఇది చాలా సంతోషకరం. బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి, టీచర్లను గౌవరించి, స్కూళ్లను మౌలిక వసతులు కల్పించినప్పుడే విద్యావ్యవస్థ మెరుపడుతుంది.''  అని అన్నారు.



    యూపీలో విద్యావ్యవస్థ దారుణమైన స్థితిలో ఉందని మనీష్ సిసోయిడా మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకంలో చపాతీ ఉప్పు పెట్టిన ఘనత మీదేనని బీజేపీపై ధ్వజమెత్తారు. చాలా స్కూళ్లు పశువుల దొడ్లుగా మారాయని సాక్షాత్తు నీతి ఆయోగే ధృవీకరించిందని ఈ సందర్భంగా విమర్శించారు. ''యూపీలో 50 వేళ స్కూళ్లలో సరైన ఫర్నిచర్ లేదు. 35 వేల స్కూళ్లకు బౌండరీ వాల్స్ లేవు. 60వేల స్కూళ్లకు కరెంట్ కనెక్షన్ లేదు. వెయ్యికి పైగా పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు మరుగు దొడ్లు లేవు. కనీసం తాగు నీటి సౌకర్యం కూడా లేదు. అలాంటి స్కూళ్లో చదువుకునే పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.'' అని మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

    విద్యరంగానికి ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదన్నారు మనీష్ సిసోడియా. బడ్జెట్‌లో 25శాతం నిధులు కేవలం విద్యా వ్యవస్థకే కేటాయించి..సంపూర్ణ ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. ఎంతో మంది టీచర్లను ఫిన్లాండ్, హార్వర్డ్, కేంబ్రిడ్జి, సింగపూర్, జర్మనీకి ట్రైనింగ్‌కు పంపించామని.. ఇన్ని చర్యలు తీసుకోవడం వల్లే ఢిల్లీలో సగటు విద్యార్థి విద్యా ప్రమాణాలు పెరిగాయని స్పష్టం చేశారు. యూపీలో ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వస్తేనే.. అక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు సిసోడియా.
    Published by:Shiva Kumar Addula
    First published:December 17, 2020, 11:48 IST