RBI EX GOVERNOR RAGHURAMA RAJAN SUGGESTION TO FINANCE MINISTER NIRMALA SITARAMAN AHEAD OF UNION BUDGET 2022 AK
Union Budget 2022-23: బడ్జెట్ ఇలా ఉంటే బాగుంటుంది.. RBI మాజీ గవర్నర్ సూచనలు
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ (ఫైల్ ఫోటో)
Union Budget 2022: రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలిందని... అటువంటి పరిస్థితిలో, ఆర్థిక వ్యవస్థను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ఈ పని కేవలం ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా సాధించబడదని అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ రఘురామ్ రాజన్ బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీరామన్కు సూచనలు చేశారు. వ్యవసాయం, తయారీ రంగాల సహాయంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించాలనే కలలను మాత్రమే వదిలి ఇతర రంగాలపై దృష్టి సారించాలని రాజన్ అన్నారు. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు బడ్జెట్లో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పలు వ్యాఖ్యలు చేశారు. దేశం తక్షణమే బడ్జెట్ విషయంలో సాంప్రదాయ పద్ధతిని వదిలివేయాలని సూచించారు. ఏటా కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయన సూచించారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి మరీ నిరాశావాదంగా లేదా ఆశాజనకంగా లేదని రాజన్ అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది బడ్జెట్లో విజన్ అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ డాక్యుమెంట్లో టారిఫ్‌ను పెంచడం, సబ్సిడీని తగ్గించడం గురించి మాత్రమే మాట్లాడకూడదని సూచించారు. వచ్చే ఐదేళ్లకు ఇదే విజన్ డాక్యుమెంట్‌గా ఉండాలని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ అన్నారు. వచ్చే బడ్జెట్ ఇందుకు సరైన అవకాశంగా నిలుస్తుందని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్లో వ్యవసాయం, తయారీ రంగాలపై మాత్రమే దృష్టి పెట్టడం సరికాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే అనేక ఇతర రంగాలు ఉన్నాయని అన్నారు.
టెలిమెడిసిన్, టెలి-లేయరింగ్, ఎడ్యుటెక్ వంటి కొత్త రంగాలపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. డేటా రక్షణ కోసం ప్రపంచ స్థాయి నియమాలను రూపొందించాలని అన్నారు. ఈ సమయంలో సామాన్యులు, మార్కెట్‌పై నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అత్యంత ప్రధానమని రాజన్ అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలిందని... అటువంటి పరిస్థితిలో, ఆర్థిక వ్యవస్థను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ఈ పని కేవలం ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా సాధించబడదని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని... చిన్న ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఉక్కు, రాగి, సిమెంట్ వంటి వాటికి డిమాండ్ పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో పనితీరు బలహీనంగా ఉన్న రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ సూచించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎకు నిధులు పెంచడంపై ప్రస్తావించారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం సవాలుతో పాటు అవసరమని వ్యాఖ్యానించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.