'ఆధార్' నందన్ నీలేకనికి ఆర్బీఐ కీలక బాధ్యతలు..

కమిటీ తొలి సమావేశం జరిగిన 90రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదికను తమకు అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాల్సిందిగా ఆర్బీఐ కమిటీకి సూచించింది.

news18-telugu
Updated: January 8, 2019, 6:08 PM IST
'ఆధార్' నందన్ నీలేకనికి ఆర్బీఐ కీలక బాధ్యతలు..
నందన్ నీలేకని(File)
  • Share this:
ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకనికి ఆర్బీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓ ఉన్నత స్థాయి కమిటీకి ఆయన్ను ఛైర్మన్‌గా నియమించింది. దేశంలో డిజిటల్ లావాదేవీల ప్రక్రియను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా.. ఆర్బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నందన్ నీలేకనీ నేత్రుత్వంలో పనిచేసే ఈ కమిటీలో మరో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు.

దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం.. డిజిటల్ చెల్లింపులను మరింత పకడ్బందీగా జరపడం వంటి లక్ష్యాలతో ఈ కమిటీని ఏర్పరిచినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కమిటీ తొలి సమావేశం జరిగిన 90రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదికను తమకు అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాల్సిందిగా కమిటీకి ఆర్బీఐ సూచించింది. నందన్ నీలేకని నేత్రుత్వం వహిస్తున్న ఈ కమిటీలో.. ఆయనతో పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్, విజయ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కిశోర్, ఐటీ&స్టీల్ మాజీ సెక్రటరీ అరుణ్ శర్మ సభ్యులుగా ఉండనున్నారు.First published: January 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>