Ravi Teja Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..
Ravi Teja Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..
Ravi Teja Ramarao On Duty: మార్చ్ నుంచి మొదలు పెట్టి జూన్ వరకు వరసగా సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. పైగా అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయక్కడ. దాంతో చిన్న సినిమాలకు విడుదల చేసే సమయం కూడా దొరకడం లేదు. మీడియం బడ్జెట్ సినిమాలు సైతం కొన్ని విడుదల తేదీల కోసం నానా తంటాలు పడుతున్నాయి.
Ravi Teja Ramarao On Duty: మార్చ్ నుంచి మొదలు పెట్టి జూన్ వరకు వరసగా సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. పైగా అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయక్కడ. దాంతో చిన్న సినిమాలకు విడుదల చేసే సమయం కూడా దొరకడం లేదు. మీడియం బడ్జెట్ సినిమాలు సైతం కొన్ని విడుదల తేదీల కోసం నానా తంటాలు పడుతున్నాయి.
మార్చ్ నుంచి మొదలు పెట్టి జూన్ వరకు వరసగా సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. పైగా అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయక్కడ. దాంతో చిన్న సినిమాలకు విడుదల చేసే సమయం కూడా దొరకడం లేదు. మీడియం బడ్జెట్ సినిమాలు సైతం కొన్ని విడుదల తేదీల కోసం నానా తంటాలు పడుతున్నాయి. అందులో రవితేజ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారంటే నమ్మశక్యం కాదు.
మొన్నటికి మొన్న ‘ఖిలాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. ఈ సినిమా అంతగా ఆడలేదు.. డిస్ట్రిబ్యూట్లకు భారీ నష్టాలనే తీసుకొచ్చింది ఖిలాడి. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రం 10 కోట్లకు పైగానే నష్టాలు తెచ్చింది. దాంతో ఈయన తర్వాతి సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ బిజినెస్‌పై భారీ ప్రభావం పడుతుంది. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం.
ఇందులో రవితేజ సరసన మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్, ధనుష్ కర్ణణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేసాడు దర్శకుడు శరత్ మండవ. ఈ సినిమాను మార్చ్ 25న విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే అప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేస్తున్నారు.
దాంతో రవితేజ సినిమా వాయిదా పడింది. అందుకే ఈ సినిమాను ఎప్రిల్ 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పుడు కూడా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కేజియఫ్ 2తో పాటు విజయ్ బీస్ట్ సినిమాలు కూడా వరస రోజుల్లోనే విడుదల కానున్నాయి. అందుకే రామారావు ఆన్ డ్యూటీ అప్పుడు కూడా విడుదల కావడం లేదు.
దాంతో ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్న నిర్మాతలు.. థియేటర్స్ వైపు సినిమాను తీసుకొస్తున్నారు. జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీ రాబోతుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
థియేటర్స్‌లో వచ్చిన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటిటి విడుదలకు కూడా సిద్ధమవుతుంది. సోనీ లివ్‌లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మంచి రేట్ రావడంతో సినిమాను అక్కడ ఇచ్చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. జూన్ 17న పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో అప్పుడే ఫిక్స్ అయిపోయారు రామారావు నిర్మాతలు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.