హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ravi Teja 69 : కొత్త మూవీ అనౌన్స్ చేసిన రవి తేజ.. వరుస సినిమాలతో క్రాక్ పుట్టిస్తోన్న మాస్ మహారాజ్..

Ravi Teja 69 : కొత్త మూవీ అనౌన్స్ చేసిన రవి తేజ.. వరుస సినిమాలతో క్రాక్ పుట్టిస్తోన్న మాస్ మహారాజ్..

Raviteja for RT69 Photo : Twitter

Raviteja for RT69 Photo : Twitter

Ravi Teja 69 :ఈ ఏడాది రవితేజ తన సినిమా “క్రాక్” తో ఎంట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. క్రాక్ ఇచ్చిన బూస్ట్‌తో ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. వాటిలో ఆల్రెడీ “ఖిలాడి”, “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాలు కంప్లీట్ అవుతుండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ మొదలైంది.

ఇంకా చదవండి ...

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఆ సంగతి పక్కనపెడితే.. రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

MAA Elections | Poonam Kaur : ప్రకాష్ రాజ్‌ గెలిస్తే.. అసలు విషయం బయట పెడుతా.. పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు వైరల్..

‘ఖిలాడి’  సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈయన లండన్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి పలు తెలుగు, తమిళ చిత్రాలకు రచయతగా పనిచేశారు.ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక కథానాయికగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

Arjun | Pushpa : ముందుకు జరిగిన పుష్ప రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన..

ఇక అది అలా ఉంటే మరోవైపు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే అక్టోబర్ 4 నుంచి జరుగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Khiladi Movie, Rama Rao, Ravi Teja, RT69, Trinadha Rao Nakkina

ఉత్తమ కథలు