శ్రీలంక తమిళుల సంగతి చూడండి... కేంద్రానికి రవిశంకర్ విజ్ఞప్తి

Citizenship Amendment Bill : ఉత్తరాది పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలనుకుంటున్న కేంద్రం శ్రీలంక నుంచీ వచ్చే తమిళులకు కూడా పౌరసత్వం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 10, 2019, 12:05 PM IST
శ్రీలంక తమిళుల సంగతి చూడండి... కేంద్రానికి రవిశంకర్ విజ్ఞప్తి
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్
  • Share this:
Citizenship Amendment Bill : కేంద్ర ప్రభుత్వం ఉత్తరాదిన మూడు పొరుగు రాష్ట్రాల నుంచీ (పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్) వచ్చే ముస్లిమేతరులకు భారతీయులుగా పౌరసత్వం కల్పించేందుకు సంబంధించిన పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేయడంతో... కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. దక్షిణాదిన తమిళనాడులో... లక్ష మందికి పైగా శ్రీలంక తమిళ ప్రజలు... శరణార్థులుగా ఉంటున్నారు. వాళ్లకు కూడా భారత పౌరసత్వం కల్పించాలని కోరుతూ... ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవి శంకర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో లక్ష మందికి పైగా ఉన్న శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని కోరారు. 35 ఏళ్లుగా ఉంటున్నా వాళ్లు శరణార్థులుగానే ఉండాల్సి వస్తోంది తప్ప... భారతీయులుగా గుర్తింపు పొందలేకపోయారని ఆయన తెలిపారు.


సోమవారం రాత్రి పౌరసత్వ బిల్లును లోక్ సభ ఆమోదించింది. సభలో మొత్తం 391 ఓట్లు పోలవగా, బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు, వివక్షలూ తట్టుకోలేక 2014 డిసెంబర్ ఆఖరులోపు దేశంలోకి వలస వచ్చిన... ముస్లింలు కాని వారికి పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ బిల్లులో సవరణలు చేసింది కేంద్రం. ఆ బిల్లును హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో సోమవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరిపి... తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. ఐతే ఈ బిల్లును కాంగ్రెస్, టీఆర్ఎస్, MIM సహా కొన్ని పార్టీలు తప్పు పట్టాయి. పౌరసత్వం పేరుతో ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శి్ంచింది. MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా బిల్లు ప్రతులను లోక్‌సభలోనే చించి వేసి తన నిరసన తెలిపారు. మొత్తంగా బిల్లును లోక్ సభ ఆమోదించడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది. నెక్ట్స్ రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.


కోలీవుడ్‌ని శాసిస్తున్న ఢిల్లీ బ్యూటీ యషికా ఆనంద్


ఇవి కూడా చదవండి :

లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకుపై బాంబు దాడి... తృటిలో తప్పించుకున్న తల్హా సయీద్

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...

విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...

ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...

భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...
Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading