Ratan Tata awarded Sewa Ratna : ప్రముఖ వ్యాపారవేత్త,టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు సేవా రత్న(Sewa Ratna) అవార్డు లభించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుబంధ సంస్థ సేవా భారతి.. శుక్రవారం సేవా రత్న అవార్డులను అందజేసింది. రతన్ టాటా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్‌తోపాటు మరో 24 మంది వ్యక్తులు, సంస్థలకు సేవా రత్న పురస్కారాలు అందజేసింది సేవా భారతి. ఉత్తరాఖండ్ గవర్నర్ లెప్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్) చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. సమాజానికి నిస్వార్థంగా వారు చేసిన వెలకట్టలేని సేవలకు గాను వారికి ఈ అవార్డును అందించినట్లు సేవాభారతి ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదని ప్రకటనలో తెలిపింది.
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో అసోం రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అసోం బైభవ్‌ను ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ ముంబైలో రతన్ టాటాకు అందజేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను మెరుగుపరిచే రంగంలో రతన్ టాటా చేసిన కృషికి అస్సాం బైభవ్ అవార్డు లభించింది. ఇక,రతన్ టాటా...భారతదేశంలోని రెండు అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్ (2008), పద్మ భూషణ్ (2000)ను అందుకున్న విషయం తెలిసిందే.
Prices Hike : సామాన్యుడికి మరో షాక్..పెరిగిన CNG,PNG ధరలు
భారత్‌లోని తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన టాటా కుటుంబం.. విలువలు, దాతృత్వానికి మారు పేరుగా నిలిచింది. 19వ శతాబ్దం మధ్యకాలంలో జంషెడ్ జీ టాటాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం నేటి రతన్ టాటా వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చిన టాటా వారసులు సంస్థను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆ సంస్థకు ఆధునికత జోడించి, ఐటీ విభాగాన్ని మూలస్తంభంగా మార్చడంలో రతన్ టాటా కృష్టి మరువలేనిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ratan Tata, RSS