RAT JUMPS ON AIR INDIA FLIGHT AT SRINAGAR AIRPORT SERVICE DISRUPTED FOR TWO HOURS PVN
Air India : అంత పెద్ద ఎయిరిండియా ఫ్లైట్ టేకాఫ్ ని అడ్డుకున్న చిన్న ఎలుక
ఎయిర్ ఇండియా(ప్రతీకాత్మక చిత్రం)
Rat Stopped Air India Flight : ఓ చిన్న ఎలుక..ఎయిరిండియా విమానం టేకాఫ్ ని అడ్డుకుంది. సాధారణంగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రయణాలు ఆలస్యమవుతుండటం తెలిసిందే. అయితే టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ఇండియా విమానానికి మాత్రం ఓ ఎలుక తలనొప్పిగా మారింది.
Rat Stopped Air India Flight : ఓ చిన్న ఎలుక..ఎయిరిండియా విమానం టేకాఫ్ ని అడ్డుకుంది. సాధారణంగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రయణాలు ఆలస్యమవుతుండటం తెలిసిందే. అయితే టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ఇండియా విమానానికి మాత్రం ఓ ఎలుక తలనొప్పిగా మారింది.
గురువారం మధ్యాహ్నాం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచి జమ్మూకి వెళ్లాల్సిన ఎయిరిండియా(AIR India) విమానం టేకాఫ్ కు సిద్ధమైంది. ప్రయాణికులందరూ తమ తమ సీట్లలో హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో ఆ విమానం బయలుదేరేది. ఇంతలో ఉన్నట్లుండి ఆ విమానం టేకాఫ్‌ను నిలిపివేస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు. దీంతో ఏమైందో తెలియక ప్రయాణికులు కంగారుపడ్డారు. అయితే అసలు విషయం ఏంటంటే..విమానంలో ఎలుక ఉన్నట్లు గుర్తించిన ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఆ విషయాన్ని చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది పై అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత ఎలుకను పట్టుకునేందుకు ఓ టీమ్ విమానం దగ్గిరికి చేరుకుంది. దానిని పట్టుకునేందుకు దాదాపు రెండు గంటలు శ్రమించారు.
ఎట్టకేలకు ఆ ఎలుకను(Rat) పట్టుకున్నారు. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం.. 4.10 గంటలకు టేకాఫ్ అయింది. ఎలుక కారణంగా రెండు గంటల ఆలస్యంగా విమానం బయల్దేరడం..ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైంది. ఈ దరిద్రపు ఎలుక ఇప్పుడే రావాలా విమానంలోకి..అసలు విమానంలో ఎలుక ఎలా వచ్చిందబ్బా అని ప్రయాణికులు మనసులో అనుకుంటూ తమ ప్రయాణాన్ని సాగించారు. కాగా,ఎయిర్ఇండియా సంస్థ బాధ్యతలను టాటా చేపట్టాక ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరు 8న ప్రభుత్వం నుంచి వేలంలో సంస్థను కొనుగోలు చేసిన టాటా సంస్థ.. ఈ ఏడాది జనవరి 27 నుంచి బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. ఎలుక ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిరిండియా ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అందరి కంటే ఎక్కువగా రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసి టాటా గ్రూప్ ఈ సంస్థను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్‌లోని ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో కిందటేడాది అక్టోబర్ 8న ఈ కంపెనీకే ఎయిర్ ఇండియా దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ఎయిరిండియాను టాటా సంస్థ తమ చేతుల్లోకి తీసుకుంది. ప్రయాణికుల కంఫర్ట్, సర్వీసుల పరంగా చూసి, విమాన ప్రయాణానికి ఒక ఎయిర్‌లైన్స్‌ను చాయిస్‌గా ఎంపిక చేసుకోవాల్సి వస్తే అది ఎయిరిండియానే అయ్యేలా కృషి చేసేందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం అని రతన్ టాటా చెప్పిన విషయం తెలిసిందే.
మొదట 1932లోఎయిర్ ఇండియాను జేఆర్డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విమానయాన రంగాన్ని జాతీయం చేయడంతో ఎయిర్ ఇండియాలో టాటా ఎయిర్‌లైన్స్‌కు ఉన్న 49 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీని అప్పటి సర్కార్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది. దీంతో సంస్థ పేరును ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. 1953లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. కంపెనీ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా నుంచి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీకి మళ్లీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఇంత కాలం తర్వాత మళ్లీ ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.