భారీగా ఖర్చులు తగ్గించుకోనున్న రాష్ట్రపతి భవన్.. ఆ కీలక నిర్ణయమూ వాయిదా..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం రూ.10కోట్ల విలువ చేసే విలాసవంతమైన నూతన లిమోసిన్ కారు కోనుగోలు చేయాలని రాష్ట్రపతి భవన్ వర్గాలు భావించాయి. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని సైతం వాయిదా వేశారు.

news18-telugu
Updated: May 14, 2020, 8:35 PM IST
భారీగా ఖర్చులు తగ్గించుకోనున్న రాష్ట్రపతి భవన్.. ఆ కీలక నిర్ణయమూ వాయిదా..
రామ్‌నాథ్ కోవింద్
  • Share this:
కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ నిర్వహణ ఖర్చులను ఆదా చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీనికితోడు రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం రూ.10కోట్ల విలువ చేసే విలాసవంతమైన నూతన లిమోసిన్ కారు కోనుగోలు చేయాలని రాష్ట్రపతి భవన్ వర్గాలు భావించాయి. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని సైతం వాయిదా వేశారు. భవన్‌లో జరిగే విందులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయకూడదని, రాబోయే కాలంలో జరిగే విందుల్లో పరిమిత సంఖ్యలో ఆహార పదార్థాలను ఉంచడంతో పాటు అతిథుల జాబితాను కొంతమేర తగ్గించాలని యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పెద్దఎత్తున జరిగే పూల అలంకరణలు సైతం పరిమితం చేయాలని ఆలోచిస్తోంది.

వచ్చే ఏడాది వరకు భవన్‌కు సంబంధించిన ఏ నిర్మాణలు చేపట్టొద్దని నిర్ణయించారు. ఇదిలావుంటే.. కరోనాపై పోరాడేందుకు తన వంతు సాయంగా పీఎం కేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ ఒక నెల వేతనాన్ని ఇప్పటికే విరాళంగా ప్రకటించారు. కానీ తాజాగా రాష్ట్రపతి తన జీతంలో 30 శాతాన్ని సంవత్సర కాలం పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు రాష్ట్రపతి భవన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
First published: May 14, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading