జిన్‌పింగ్‌ భోజనంలో టమాటా చారు.. చైనా అధ్యక్షుడికి తమిళ రుచులు

మోదీ-జిన్‌పింగ్ భేటీలో భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.

news18-telugu
Updated: October 11, 2019, 6:42 PM IST
జిన్‌పింగ్‌ భోజనంలో టమాటా చారు.. చైనా అధ్యక్షుడికి తమిళ రుచులు
మోదీ, జిన్‌పింగ్
  • Share this:
మహాబలిపురంలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దక్షిణ భారత వంటకాలను రుచి చూడబోతున్నారు. ఐటీసీ హోటల్‌లో తమిళనాడు వంటకాలతో ఇవాళ రాత్రికి ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. ముఖ్యంగా స్థానిక రుచులను ఆయనకు పరిచయం చేస్తారు. టమాటా చారు, అరుచువిట్టా సాంబార్, కడలాయ్ కుర్మా, కవనరాశి హల్వాను చైనా అధ్యక్షుడికి వడ్డిస్తారు. అంతకు ముందు జిన్‌పింగ్‌తో కలిసి మహాబలిపురంలోని శోర్ ఆలయాన్ని సందర్శించారు మోదీ. మహాబలిపురం చరిత్రను, ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు.

చైనా అధ్యక్షుడితో మొత్తం 6 గంటల పాటు గడపనున్నారు మోదీ. పలు విడతల వారీగా ఇరువురు సమావేశం కానున్నారు. ఒక్కో భేటీకి సుమారు 40 నిమిషాలు కేటాయించినట్లు సమాచారం. మోదీ-జిన్‌పింగ్ భేటీలో భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి ఒప్పందాలను వివరిస్తారు.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>