White Crow | అరుదైన తెల్ల కాకిని చూడండి..

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకులందు ఈ తెల్ల కాకి వేరు.

news18-telugu
Updated: August 13, 2020, 4:49 PM IST
White Crow | అరుదైన తెల్ల కాకిని చూడండి..
తెల్ల కాకి (Image; Kalinga TV)
  • Share this:
కాకి నల్లగా ఉంటుంది. ఎవరైనా నల్లగా ఉండే వారిని ఫ్రెండ్స్ ఏడిపించడానికి నల్లగా కాకిలా ఉన్నావంటూ ఆటపట్టిస్తుంటారు. కాకి కలర్ ఫిక్స్ గా ఉంటుందని ఆ నానుడి లేదా పద ప్రయోగాలు వాడుకలోకి వచ్చాయి. అయితే, పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకులందు ఈ తెల్ల కాకి వేరు. ఈ అరుదైన తెల్ల కాకి ఒడిశాలో కనిపించింది. ఒడిశాలోని జార్సుడడ జిల్లాలో ఓ ఇంటి గేటు వద్ద కనిపించింది. దాన్ని చూసిన వారు మొదట ఆశ్చర్య పడ్డారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చి కాకిని జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని వెళ్లారు. కాకుల్లో జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి తెల్ల కాకులు కూడా పుడుతుంటాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో, ఢిల్లీలో కూడా తెల్ల కాకులు కనిపించాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 13, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading