1936 తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన పాము

దుద్వా టైగర్ రిజర్వ్‌లో రెడ్ కోరల్ కుక్రీ'ని గుర్తించారు అధికారులు. తఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో దీని జాడలు ఉన్నాయి కాబట్టి ఈ పామును జంతు శాస్త్ర పరిభాషలో 'ఓలిగోడాన్ ఖేరీన్సిస్' అని పిలుస్తారు.

news18-telugu
Updated: February 20, 2019, 6:07 PM IST
1936 తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన పాము
1936 తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన పాము(image: http://www.indiansnakes.org)
news18-telugu
Updated: February 20, 2019, 6:07 PM IST
రెడ్ కోరల్ కుక్రీ... భారతదేశంలోని అత్యంత అరుదైన సర్ప జాతుల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడో 1936లో ఓసారి కనిపించింది. ఆ తర్వాత 'రెడ్ కోరల్ కుక్రీ' జాడ మళ్లీ కనిపించలేదు. 82 ఏళ్ల తర్వాత ఆ పాము మళ్లీ కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని తఖీంపూర్ ఖేరీలో గల దుద్వా టైగర్ రిజర్వ్‌లో ఈ పామును గుర్తించారు అధికారులు. తఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో దీని జాడలు ఉన్నాయి కాబట్టి ఈ పామును జంతు శాస్త్ర పరిభాషలో 'ఓలిగోడాన్ ఖేరీన్సిస్' అని పిలుస్తారు.

సోమవారం రాత్రి సోనారీపూర్ రేంజ్ అడవుల్లో సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా సోనారీపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక మీటర్ పొడవైన రెడ్ కోరాల్ కుక్రీ సర్పం కనిపించింది. "నారింజ రంగులో మెరుస్తూ కనిపించిన అలాంటి పామును గతంలో ఎప్పుడూ చూడలేదు. అందుకే సిబ్బంది వెంటనే ఫోటో తీసి, రికార్డ్ చేశారు" అని దుద్వా టైగర్ రిజర్వ్‌ ఫీల్డ్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే తెలిపారు. ఆ ఫోటో ఆధారంగా ఆ పాము జాతి వివరాల గురించి తెలుసుకుంటే అది 'రెడ్ కోరల్ కుక్రీ' అని తేలింది. అయితే అలాంటి పామును తాను 2004లో ఓసారి చూసినట్టు పాండే చెబుతున్నారు.

ఇక నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం 'రెడ్ కోరల్ కుక్రీ' రాత్రిపూట సంచరించే విషపూరితం కాని సర్పం. కీటకాలు, పురుగులను తింటుంది. రెడ్ ఆరెంజ్ కలర్‌లో ఉండటం, దాని పళ్లు నేపాలీ కత్తి 'ఖుక్రీ'లా ఉండటంతో దానికి రెడ్ కోరల్ కుక్రీ అనే పేరు వచ్చింది.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలుఇవి కూడా చదవండి:

Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన
Loading...
Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...

Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు
First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...