కేజీఎఫ్.. అక్కడ బంగారాన్ని మించిన లోహ నిక్షేపాలు..?

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారమే కాదు.. అంతకంటే విలువైన లోహ నిక్షేపాలు అక్కడ ఉన్నాయని అంటున్నారు ఆ రాష్ట్ర ఎంపీ మునిస్వామి.

news18-telugu
Updated: June 3, 2020, 10:00 AM IST
కేజీఎఫ్.. అక్కడ బంగారాన్ని మించిన లోహ నిక్షేపాలు..?
ప్రతీకాత్మక చిత్రం (ఫొటో - వికీపీడియా)
  • Share this:
కేజీఎఫ్.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. వందల ఏళ్ల పాటు బంగారాన్ని అందించిన నిధి. ఈ పేరు మీద ఫిక్షన్ కథతో వచ్చిన సినిమా కూడా సెన్సేషన్ అయ్యింది. అయితే, బంగారమే కాదు.. అంతకంటే విలువైన లోహ నిక్షేపాలు అక్కడ ఉన్నాయని అంటున్నారు ఆ రాష్ట్ర ఎంపీ మునిస్వామి. ఆ లోహ నిక్షేపాలను వెలికి తీసేందుకు త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేజీఎఫ్ పరిధిలోని బీజిఎంఎల్ బంగారం గనుల ప్రాంతంలోనే పల్లాడియం లోహముందని తెలిపారు. ఇందుకు సంబంధించి తాను గతంలోనే గని కార్మికులను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లానని, స్పందించిన ప్రధాని.. గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పల్లాడియాన్ని వెలికితీసే అవకాశం ఉందని తెలిపారు.

ప్లాటినం కుటుంబానికి చెందిన పల్లాడియం వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. బంగారంతో పోలిస్తే, తక్కువ ఉష్ణోగ్రతకే కరిగిపోతుంది. ప్రపంచంలో ఇది చాలా అరుదుగా లభిస్తుంది. కార్ల ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ విభాగాలు, ఆభరణాలు తదితరాల్లో దీన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ లోహం రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో లభిస్తున్నా డిమాండ్‌కు తగినంత లేదు. దీని ధర బంగారం, ప్లాటినం కన్నా అధికంగా ఉంటుంది.

First published: June 3, 2020, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading