Home /News /national /

RARE OXE IN GKVK EXPO OXE RATE ONE CR IN KARNATAKA VRY

Oxen rate one cr : వామ్మో ఆ ఎద్దుల ధర కోటి రూపాయలట..!.. ఒక్క డ్రాప్ వీర్యానికే..వెయ్యి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Oxe rate one cr : ఎద్దు ధర కోటి రూపాయలు పలుకుందట అంతే కాదు గొర్రెలు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పలుకుంది.. ఇంతకి ఏమిటి వాటి ప్రత్యేకత .. ఎందుకు అంత డిమాండ్..

    వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను పాటించడంతో పాటు పశు సంపదపై దృష్టి సారిస్తే కోట్ల రూపాయలను కూడా సంపాదించవచ్చంటూ రైతులు నిరూపిస్తున్నారు. దీంతో ఉద్యోగం వ్యాపారం చేసే కాదు పశుసంపదపై దృష్టి సారిస్తే కూడా ఇలాంటీ ఫలితాలే వస్తాయంటున్నారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు..

    వివరాల్లోకి వెళితే... బెంగళూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని గాంధీ కృషీ విజ్ఞాన కేంద్రం(జీకేవీకే)లో వ్యవసాయ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో రైతులు (karnataka farmers) తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను ప్రదర్శనకు పెట్టారు.. సాధరణంగా మేలు జాతి గిత్తలు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ధర పలుకుతాయి. అయితే కర్ణాటకలోని హళ్లికార్‌ జాతి గిత్త ఏకంగా ఒక కోటి రూపాయలు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ జాతి ఆవు పాలలో ఎ-2 ప్రొటీన్‌ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు .

    ఇది చదవండి : ఏసి బస్సులో ఎగిసిన మంటలు.. ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు... ఇద్దరు మృతి..


    హళ్లికార్ జాతికి చెందిన ఈ గిత్త వీర్యం ఒక డోసు ధర రూ.వెయ్యి పైగానే ఉంటుందంటున్నారు. సుమారు.. మూడేళ్లు నిండిన గిత్త నుంచి ప్రతి వారం వీర్యాన్ని సేకరించి నైట్రోజెన్ కంటైనర్లలో భద్రపరుస్తారు. వందల ఏళ్ల వరకు ఈ వీర్యాన్ని భద్రపరచవచ్చని జీకేవీకే నిపుణులు చెబుతున్నారు.

    దేశంలో మొట్ట మొదటి సారిగా ప్రైవేటు సంస్థల సహకారంతో వీర్యాన్ని సేకరించి భద్రపరచటం... హళ్లికార్ జాతులతో మొదలైనట్లు ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. సరైన పోషక ఆహారం అందిస్తే ఈ జాతి పశువులు 20 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. దీంతో కోటి రుపాయాల వరకు చెల్లించి వీటిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వెళుతున్నారు..

    ఇది చదవండి : బండి సంజయ్ జిల్లాల పర్యటన కారణం ఇదే.. ! మరింత పెరగనున్న పోలిటికల్ హీట్


    ఇదే మేళాలో ప్రదర్శిస్తున్న పలు గొర్రెలు కూడా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పలుకుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దక్షిణ ఆఫ్రికా జాతి డార్ఫర్ రూ.10 లక్షలకు అమ్ముడవుతోందని చెప్పారు. పర్షియన్, దాస్కట్ హాన్ జాతుల నుంచి ఈ గొర్రెను వృద్ధి చేసినట్టు చెబుతున్నారు..సుమారు 120 కిలోల బరువు ఉంటుంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Agriculture, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు