హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మొక్కులు తీర్చుకున్న ముస్లిం కుటుంబం.. వెంకటేశ్వర స్వామివారికి భారీగా కానుకలు..

మొక్కులు తీర్చుకున్న ముస్లిం కుటుంబం.. వెంకటేశ్వర స్వామివారికి భారీగా కానుకలు..

మొక్కులు తీర్చుకున్న ముస్లిం కుటుంబం

మొక్కులు తీర్చుకున్న ముస్లిం కుటుంబం

Tamilnadu:  చెన్నైకి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

దేశ, విదేశాల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జనాలు దర్శించుకోవడానికి బారులు తీరుతారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆ ఏడుకొండల స్వామివారిని భావిస్తుంటారు. ఆయనకు కుల, మతాలకు అతీతంగా భక్తులు ఆయన దగ్గరకు వచ్చి దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఒక ముస్లింకుటుంబం స్వామివారిని భక్తితో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన అబ్దుల్ ఘనీ, సుబీనీ బానులు తిరుమల స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఏడుకోండల వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

అంతే కాకుండా.. ఆలయ అధికారులను కలిసి తిరుమల ట్రస్టుకు రూ. 1.02 కోట్లను విరాళంగా ఇచ్చారు. అయితే.. అబ్దుల్ ఘనీ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. ఆయన గతంలో కూడా స్వామివారికి విరాళాలు ఇచ్చారు. కరోనా సమయంలో ఆలయ ప్రాంగణంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి మల్టీ డైమెన్షనల్ ట్రాక్టర్-మౌంటెడ్ స్ప్రేయర్‌ను విరాళంగా ఇచ్చాడు.  తాజాగా ఇచ్చిన విరాళంలో.. కొత్తగా నిర్మించిన పద్మావతి విశ్రాంతి భవనం కోసం రూ.87 లక్షల విలువైన ఫర్నిచర్, పాత్రలు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.15 లక్షలకు డిమాండ్ డ్రాఫ్ట్ ఉన్నాయి.

అంతకుముందు ఆలయానికి కూరగాయలు తరలించేందుకు రూ.35 లక్షల రిఫ్రిజిరేటర్ ట్రక్కును అందించారు.ఈ క్రమంలో ఆలయ అధికారులు వారికి ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. అదే విధంగా పండితులు అబ్దుల్ ఘనీకుటుంబానికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా, తిరుమల ఆలయంలో సోమవారం 67,276 మంది భక్తులు వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశారు. టిటిడికి హుండీ ఆదాయం రూ. 5.71 కోట్లు మరియు కొండ ఆలయంలో దర్శనం కోసం సుమారు 12 గంటల సమయం మంగళవారం ఉదయం నాటికి సుమారుగా అంచనా వేయబడింది.

ఇదిలా ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath)కు గుడి కట్టించి పూజలుచేస్తున్నాడు ఒక వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రభాకర్ మౌర్య అనే 32 ఏళ్ల ఆధ్యాత్మిక గాయకుడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)పై అభిమానంతో ఏకంగా ఒక ఆలయం (Temple) కట్టించారు. ఈ ఆలయంలో యోగి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు కూడా చేస్తున్నారు.

అయోధ్య (Ayodhya)లో రామజన్మభూమి వద్ద రామమందిరాన్ని చూడాలనే బలమైన కోరిక చాలామంది హిందువులలో ఉంది. వారిలో ప్రభాకర్ మౌర్య ఒకరు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే వ్యక్తికి గుడి కట్టించి, పూజించాలని 2015లోనే మౌర్య ప్రతిజ్ఞ చేశారు. కాగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో రామమందిరం నిర్మితమవుతోంది. దీంతో రామమందిరాన్ని ఆదిత్యనాథ్ నిర్మిస్తున్నారని ఆయనకు ఒక గుడి కట్టించారు. రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే మౌర్య గుడి కట్టించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Andhra Pradesh, Tamilnadu, Ttd news, VIRAL NEWS

ఉత్తమ కథలు