హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రేప్ చేశాడని అప్పుడు కేసుపెట్టింది.. బెయిల్ ఇవ్వమని ఇప్పుడు కోర్టును వేడుకుంటోంది

రేప్ చేశాడని అప్పుడు కేసుపెట్టింది.. బెయిల్ ఇవ్వమని ఇప్పుడు కోర్టును వేడుకుంటోంది

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్రియుడు తనను గర్భవతిని చేసి.. మోసం చేశాడని జైలు పాలు చేసిన యువతే.. ఇప్పుడు అతడి కోసం కోర్టు మెట్లెక్కింది. బెయిల్ ఇస్తే పెళ్లి చేసుకుంటామని ప్రాధేయపడుతోంది.

ఓ యువతి తన ప్రియుడిపై కేసుపెట్టింది. అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని పోలీసులకు పట్టించింది. కానీ ఇప్పుడదే యువతి అతడికి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతోంది. అహ్మదాబాద్ నగరంలో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2021 డిసెంబరు 31న ఓ యువతి తన ప్రియుడిపై కేసు పెట్టింది. తామిద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని పోలీసులకు చెప్పింది. కానీ తాను గర్భం దాల్చగానే, అతడు మాట మార్చాడని వాపోయింది. తనను వదిలేసి కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఐతే అతడిని జైలు నుంచి విడుదల చేయాలని అదే బాధితురాలు కోర్టుమెట్లెక్కింది. దీనికి కారణమేంటి? ఆమెలో ఎందుకు మార్పు వచ్చింది?

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సోదరుడు నన్ను చేయి పట్టుకుని లాగాడు.. మీడియా ముందు ఓ మహిళ ఆక్రందన

బాధితురాలు నిందితుడిపై కేసు పెట్టినప్పుడు ఆమె గర్భవతి. ఇప్పటికే ఆమెకు బిడ్డ పుట్టింది. కానీ తనను గర్భవతి చేసిన ప్రియుడు జైల్లో ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇరు కుటుంబాలకు పలు మార్లు చర్చలు జరిపాయి. ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నా.. అంతా బాగానే ఉన్నా.. అతడు మాత్రం జైల్లో ఉన్నాడు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే బాధిత యువతి మళ్లీ కోర్టు మెట్లెక్కింది. తాము ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని, తన ప్రియుడికి బెయిల్ ఇవ్వాలని కోరింది. అతడు జైలు నుంచి విడుదలయితే..తన బిడ్డకు తండ్రి ప్రేమ కూడా దక్కుతుందని విజ్ఞప్తి చేసింది. ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారని.. జైలు నుంచి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది.

Crime News: ఆడుకోడానికని బాత్ రూమ్ కు వెళ్లిన చిన్నారి.. బలితీసుకున్న బకెట్

ఈ పిటిషన్‌పై అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించింది. ఐతే తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే ప్రభుత్వానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. నిందితుడు, బాధితురాలు పెళ్లి చేసుకొని..తమ బిడ్డతో సంతోషంగా ఉంటే.. అంతకన్నా ఏం కావాలని ఆయన పేర్కొన్నారు. మరి నిందితుడికి కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదంటే నిరాకరిస్తుందా? అనేది చూడాలి. ఇరు కుటుంబాలు మాత్రం.. ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. జైలు నుంచి వచ్చిన వెంటనే.. ఇద్దరికీ వివాహం చేస్తామని తెలిపారు. ఆ కేసును కొట్టివేస్తే.. అందరూ సంతోషంగా ఉంటామని చెబుతున్నారు.

First published:

Tags: Ahmedabad, Crime, Crime news, Gujarat

ఉత్తమ కథలు