
maharashtra minister dhananjay munde
Maharastra : మహారాష్ట్ర సీఎం కేబినేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయ్ . మహారాష్ట్ర మంత్రి ధనుంజయ ముండే తనను రేప్ చేశాడని సింగర్ రేణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహారాష్ట్ర సీఎం కేబినేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయ్ . మహారాష్ట్ర మంత్రి ధనుంజయ ముండే తనను రేప్ చేశాడని సింగర్ రేణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహారాష్ట్ర పోలీస్ కమీషనర్ పరంభీర్ సింగ్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. వెంటనే మంత్రి ధనుంజయ ముండేపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అయితే గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సింగర్ రేణు శర్మ వెల్లడించారు. రేణు శర్మ ఓషివోరా అనే పోలీస్ స్టేషన్ లో మంత్రి ధనుంజయ ముండే లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఈ నెల 10 న పోలీస్ స్టేషన్ లో వెళ్లి కంప్లైండ్ లాడ్జ్ చేస్తే.. ఫిర్యాదు ఇంతవరకు తీసుకోలేదని రేణు శర్మ తెలిపారు. ఆమె ఫైల్ చేసిన కంప్లైంట్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా తన ప్రాణానికి ముప్పు ఉందని.. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో సహాయం చేయాలని ఆమె కోరారు. మోడీతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ ను కూడా ఈ విషయంలో సహాయం చేయాలని కోరారు.
రేణు శర్మ చేసిన ట్వీట్ తో ఉద్దవ్ థాక్రే కేబినేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయ్. రాష్ట్రంలో మహిళలను కాపాడాల్సిన మంత్రులే ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఫైరవుతున్నాయ్.
Published by:Sridhar Reddy
First published:January 12, 2021, 16:52 IST