రంజన్ గొగొయ్‌కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ : రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగింపు

రిటైర్మెంట్ తర్వాత గొగొయ్ తన స్వస్థలం అసోంలోని దిబ్రుఘర్‌లో స్థిరపడే అవకాశం ఉండటంతో.. అక్కడున్న గొగొయ్ ఇంటికి ఇప్పటికే భద్రత ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: November 16, 2019, 1:11 PM IST
రంజన్ గొగొయ్‌కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ : రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగింపు
న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఫైల్ ఫోటో..
  • Share this:
సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17న రిటైర్ అవనున్న సంగతి తెలిసిందే.రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కొనసాగించనున్నారు. అయోధ్య తీర్పుకు ముందు ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రత.. రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగనుంది. రిటైర్మెంట్ తర్వాత గొగొయ్ తన స్వస్థలం అసోంలోని దిబ్రుఘర్‌లో స్థిరపడే అవకాశం ఉండటంతో.. అక్కడున్న గొగొయ్ ఇంటికి ఇప్పటికే భద్రత ఏర్పాటు చేశారు. దిబ్రుఘర్‌తో పాటు గువాహటిలోని మరో ఇంటికి కూడా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.అసోంకి చెందిన ఓ అధికారి ఈ వివరాలను వెల్లడించారు. గొగొయ్ ఇంటికి భద్రత కల్పించాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్టు తెలిపారు.

కాగా, నవంబర్ 9న అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై గొగొయ్ నేత్రుత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాలు రామజన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరో చోట ఐదెకరాలు కేటాయించనున్నారు.ఇక శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఏడుగురు సభ్యుల బెంచ్‌కు పంపించిన సంగతి తెలిసిందే.3:2 మెజారిటీతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కి పిటిషన్‌ను పంపించారు.

First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>