• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • RAMLILA ACTOR DIES IN AMRITSAR TRAIN TRAGEDY MOTHER SAYS THIS WAS THE FIRST YEAR HE PLAYED RAVANA

తొలిసారి రావణుడయ్యాడు... రైలు ప్రమాదంలో చనిపోయాడు

తొలిసారి రావణుడయ్యాడు... రైలు ప్రమాదంలో చనిపోయాడు

దల్బీర్ సింగ్( ANI Photo)

తొలిసారి రావణుడి వేషం వేసిన దల్బీర్ సింగ్ అనే యువకుడు... పంజాబ్ రైలు ప్రమాదంలో చనిపోయాడు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

  • Share this:
    పంజాబ్ అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62 దాటింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో... మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో రావణుడి వేషధారణలో ఉన్న దల్బీర్ సింగ్ కూడా చనిపోవడం... అతడి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న దల్బీర్ సింగ్... తొలిసారి రావణుడి వేషధారణలో కార్యక్రమంలో పాల్గొన్నాడు. గతంలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషాలు వేసిన దల్బీర్... ఈ సారి మాత్రం రావణుడి వేషం వేశాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.

    ఈ కార్యక్రమానికి రావాలంటూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించే తన కుమారుడు... ఈ విధంగా చనిపోవడంతో అతడి తల్లి స్వరణ్ కౌర్ కుప్పకూలిపోయారు. తన కుమారుడికి ఎనిమిది నెలల పాప ఉందని... తన కోడలికి ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం కల్పించాలని ఆమె కోరారు.





    తన సోదరుడు దల్బీర్ సింగ్ ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో చనిపోయారని అతడి సోదరుడు బల్బీర్ సింగ్ అన్నారు. రైలు పట్టాలపై ఉన్న అనేక మందిని తన సోదరుడు బయటకు పంపించాడని తెలిపారు. అయితే దురదృష్ణవుశాత్తూ ఈ ప్రమాదంలో తన సోదరుడు చనిపోయాడని వాపోయారు. మరోవైపు ఈ ప్రమాదంలో తమ తప్పిదం ఏమీ లేదని ప్రకటించిన రైల్వేశాఖ... ఘటనపై విచారణ జరపబోమని ప్రకటించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు