Nipah Virus: ఆ పండు తినడం వల్లే బాలుడికి నిఫా వైరస్ సోకిందా?.. కేరళను కలవరపెడుతున్న నిఫా..

ప్రతీకాత్మక చిత్రం (Reuters File)

ఓవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్న కేరళను.. నిఫా వైరస్ (Nipah Virus) మరింతగా కలవరపెడుతోంది.

  • Share this:
    ఓవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్న కేరళను.. నిఫా వైరస్ (Nipah Virus) మరింతగా కలవరపెడుతోంది. ఆదివారం కోజికోడ్‌లోని చాత్తమంగ‌ళం పంచాయతీలో నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మరింతగా అప్రమత్తమైంది. కేరళలో (Kerala) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించిన సంగతి తెలిసిందే. ఈ బృందం నిఫా వైరస్ కారణంగా చనిపోయిన బాలుడి కుటుంబాన్ని సందర్శించింది. అయితే ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యులు తమ అనుమానాలను ఆ బృంద సభ్యులకు తెలియజేశారు. రంబుటాన్ (Rambutan) పండ్లు తినడం వల్లే బాలుడికి నిఫా వైరస్ బారినపడినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బృంద సభ్యులు బాలుడి ఇంటికి సమీప ప్రాంతాల్లో ఉన్న రంబుటాన్ పండ్లను నమునాలను సేకరించింది.

    ఆ తర్వాత నిఫా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్న 8 మంది శాంపిల్స్‌ను, రంబుటన్ పండ్లను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి (National Institute of Virology) పరీక్షల నిమిత్తం అధికారులు పంపించారు. అలాగే బాలుడికి ప్రైమరీ కాంటాక్ట్‌లుగా మొత్తం 251 మందిని వైద్య అధికారులు గుర్తించారు. వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా బాలుడికి నిఫా వైరస్‌ కారణంగా మరణించడంతో.. చాత్తమంగ‌ళం పంచాయ‌తీ(Chathamangalam Panchayat)తోపాటు చుట్టుప‌క్కల ప్రాంతాల‌ను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. బాలుడి ఇంటి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర కంటైన్‌మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.

    Karimnagar : మరుగు మందుకోసం ఊళ్లో గబ్బిలాల వేట.. అసలు మరుగు మందు అంటే ఏంటీ.. ?

    కాంటాక్ట్ ట్రేసింగ్‌ను బలోపేతం చేయడం, సంక్రమణ ములాన్ని గుర్తించడానికి ఆరోగ్య శాఖ ప్రాధాన్యత ఇస్తుందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) తెలిపారు. చనిపోయిన 12 ఏళ్ల బాలుడు ఎక్కువ మంది వ్యక్తులతో కాంటాక్టు‌లో ఉన్నాడని చెప్పారు. ‘ఇప్పుడు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని కాంటాక్ట్ ట్రేసింగ్‌ను బలోపేతం చేయడం. మా ఫీల్డ్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. సంక్రమణ మూలాన్ని కూడా గుర్తించడం చాలా ముఖ్యమైనది. బాలుడికి ఎక్కడి నుంచి ఈ వ్యాధి సోకింది అనేది తెలియాలి. మేము నిన్న బాలుడి 251 కాంటాక్ట్‌లను గుర్తించాం. మరిన్ని కాంటాక్ట్‌లు కూడా ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరినీ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం’అని వీణా జార్జ్ సోమవారం చెప్పారు.

    YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై.. అసలు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఏం జరుగుతుంది..?

    తల్లిదండ్రులు బాలుడిని ముందుగా క్లినిక్‌కు, తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెడికల్ కాలేజీకి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కాంటాక్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని వీణా జార్జ్ చెప్పారు. ‘బాలుడి 20 హై రిస్క్‌ కాంటాక్ట్‌లలో ఏడుగురి నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని ఎన్‌ఐవీకి టెస్టింగ్ కోసం పంపడం జరిగింది. ఈ రోజు ఇందుకు సంబంధించిన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. మేము NIV భోపాల్ సహాయం కూడా కోరాం.పుణె ఎన్‌ఐవీ నేడు కోజికోడ్ మెడికల్ కాలేజ్ టెస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఫలితాలు వేగంగా పొందడానికి మాకు సహాయ పడుతుంది’అని వీణా జార్జ్ తెలిపారు.

    Wife Second Marriage: జైలు నుంచి విడుదలైన భర్త.. అప్పటికే మరో వ్యక్తిని పెళ్లి చేసుకన్న భార్య.. అతడు ఏం చేశాడంటే..

    ఇక, నిఫా వైరస్‌తో చనిపోయిన బాలుడికి తొలుత ఆగస్టు 27న జ్వరం వచ్చింది. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక క్లినిక్‌లో చేర్పించారు. ఆ తర్వాత బాలుడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి, ఆ తర్వాత వేరే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 27 నుంచి బాలుడు.. ఏ సమయంలో ఎక్కడున్నాడనే పూర్తి వివరాలతో కూడిన రూట్ మ్యాప్‌ను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. నిఫాకు సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉంటే ఆరోగ్య శాఖను సంప్రదించాలని ప్రజలను కేరళ సర్కార్ కోరింది.
    Published by:Sumanth Kanukula
    First published: