విద్యార్థిగా ఉన్నప్పుడే 1970లో భారతీయ జన సంఘ్‌లో రమణ్‌సింగ్ చేరారు. అప్పటికీ యోగి ఆదిత్యనాథ్ పుట్టనే లేదు. 1976లో జన్ సంఘ్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు రమణ్‌సింగ్.
రమణ్ సింగ్..! ఛత్తీస్‌గఢ్‌కు మూడు సార్లు సీఎంగా సేవలందించారు. ఇప్పుడు నాలుగోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న నాయకుడు..! అలాంటి నేత తన కన్నా జూనియరైన..20 ఏళ్లు చిన్నవాడైన..యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రమణ్‌సింగ్ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ (66) మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అనిల్ జైన్‌తో పాటు ఇతర పార్టీలు నేతలు ఆయన వెంట కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యానాథ్ (46) కాళ్లు మొక్కారు. స్వామీజీ ఆశీర్వాదం కోసమే కాళ్లు మొక్కినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
రమణ్‌సింగ్ రాజ్‌నందగావ్ పోటీ చేస్తున్నారు.వయసులోనే కాదు..రాజకీయం రంగంలోనూ యోగి కంటే రమణ్‌సింగ్‌కే ఎక్కువ అనుభవం ఉంది. 2003 నుంచి ఆయన ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉంటున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 1970లో భారతీయ జన సంఘ్‌లో ఆయన చేరారు. అప్పటికీ యోగి ఆదిత్యనాథ్ పుట్టనే లేదు. 1976లో జన్ సంఘ్ యువజన విభాగం అధ్యక్షుడిగా రమణ్‌సింగ్ పనిచేశారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ 1972లో జన్మించారు.
మరోవైపు రమణ్‌సింగ్‌కు చెక్ పెట్టేందుకు వాజ్‌పేయి మేనకోడలిని రంగంలోకి దింపుతోంది కాంగ్రెస్. రాజ్‌నందగావ్‌లో సీఎంపై కరుణ శుక్లా పోటీ చేస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 12న తొలి విడత, నవంబరు 20న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.