హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ramzan 2023: ఇండియాలో ఇక్కడ ఈరోజు నుంచే రంజాన్ ప్రారంభం.. !

Ramzan 2023: ఇండియాలో ఇక్కడ ఈరోజు నుంచే రంజాన్ ప్రారంభం.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రంజాన్ చంద్రుని దర్శనం సందర్భంగా కోస్తా ప్రాంతం అంతటా గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఖాజీ త్వాకా అహ్మద్ ముస్లియార్ అధికారికంగా ప్రకటించారు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

దేశ వ్యాప్తంగా ముస్లీంలంతా రంజాన్ కోసం ఎదురు చూస్తున్నారు. గురువారం నుంచే... రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతాయని భావించారు. అయితే... బుధవారం సాయంత్రం చంద్రుడు కనిపించకపోవడంతో భారతదేశంలో రంజాన్ మార్చి 24న ప్రారంభం కానుంది. అంతకుముందు, భారతదేశంలో రంజాన్ ప్రారంభ తేదీని ప్రకటించడానికి సెంట్రల్ రూట్-ఇ-హిలాల్ కమిటీ తన నెలవారీ సమావేశాన్ని హైదరాబాద్;లోని అస్తానా షుతారియా దబీర్‌పురాలోని ఖాన్‌కా కమిల్‌లో నిర్వహించింది.

దేశవ్యాప్తంగా... రంజాన్ ఉపవసాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. కానీ...  కర్నాటకలో మాత్రం రంజాన్ మాసం ప్రారంభం అయిపోయింది. కర్నాటక కోస్టల్‌లో రంజాన్ ఉపవాసాలు (రంజాన్ 2023) నేటి (మార్చి 23) నుండి ప్రారంభమయ్యాయి. మంగళూరులో రంజాన్ చంద్రుని దర్శనం సందర్భంగా కోస్తా ప్రాంతం అంతటా గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఖాజీ త్వాకా అహ్మద్ ముస్లియార్ అధికారికంగా ప్రకటించారు. చంద్రదర్శనం నేపథ్యంలో ముస్లిం భక్తులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు.

రంజాన్‌లో తెల్లవారుజామున జరిగే భోజనాన్ని సహర్ అంటారు. ఉపవాసం విరమించే సయమానికి తినే విందును ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ సంప్రదాయాన్ని ఐక్యతకు చిహ్నంగా పిలుస్తారు. ఇఫ్తార్ విందులో రుచికరమైన వంటకాలు ఉంటాయి. రాజకీయ నాయకులు సైతం రంజాన్ మాసంలో ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు.  భారతీయ ముస్లింలు మసీదుల్లో ఈ నెలంతా ఉచితంగా ఇఫ్తార్ భోజనాలతో ఉపవాసాన్ని విరమిస్తారు. ఇఫ్తార్ భోజనం ఖర్జూరం , నీరు త్రాగడంతో ప్రారంభమవుతుంది.

First published:

Tags: Karnataka, Ramzan, Ramzan 2023

ఉత్తమ కథలు