Home /News /national /

RAMADAN 2022 MOON SIGHTS TODAY MOON SIGHTED IN INDIA FASTING BEGINS FROM SUNDAY APRIL 3 MKS

Ramadan 2022: నెలవంక దర్శనం.. రంజాన్ మాసం ఆరంభం.. ఆదివారం నుంచే ఉపవాసాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముస్లీంలు ప్రతిష్టాత్మకంగా భావించే రంజాన్ మాసం మొదలైంది. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు.

నెలవంక కనిపించింది.. పవిత్ర రంజాన్ మాసం భారత్ లోనూ ఆరంభమైంది. ముస్లీంలు ప్రతిష్టాత్మకంగా భావించే రంజాన్ మాసం మొదలైంది. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. రంజాన్ నెల ఆరంభం నుంచి ముస్లీంలు 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. వేకువ జామునే నాలుగు గంటలకు ఆహారం తీసుకుంటారు. దీన్నే సహర్ అంటారు. ఆతర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. సాయంత్రం ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్‌గా పేర్కొంటారు.

రంజాన్ మాసంలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు తమ ధనంలో రెండున్నర శాతం సొమ్మును దానం చేస్తారు. ముస్లింలు చేసే ప్రార్థన (నమాజ్) మానసిక పరివర్తన తెస్తుందని నమ్ముతారు. నిర్మల మనసుతో పాటు మానసిక, శారీరక ప్రశాంతత నేర్పుతుంది. ఇందులో భాగంగా రాత్రివేళ చేసే ఇషా నమాజ్ తరువాత 30 రోజుల రంజాన్ మాసంలో ప్రత్యేక తరావీ నమాజ్‌ కూడా చేస్తారు.

Malaika Arora: షాకింగ్.. కారు ప్రమాదంలో మలైకా అరోరాకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు..


రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనల కోసం తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు ముస్తాబయ్యాయి. కాగా.. తెలంగాణలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపులు ఇచ్చింది. గంట ముందు.. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వెసులుబాటు కలిపించింది. రంజాన్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

XE Variant : మళ్లీ కరోనా పీడ.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి: WHO వార్నింగ్


పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సీఎంలు ఆకాంకింక్షారు. తెలంగాణకు ప్రత్యేకమైన “గంగజమునా తెహజీబ్ ” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని సీఎం కేసీఆర్ అభిలాషించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Muslim Minorities, Ramadan 2022, Ramzan

తదుపరి వార్తలు