RAM TEMPLES JANUARY 29 HEARING DEFERRED DUE TO NON AVAILABILITY OF JUDGE MS
అయోధ్య రామ మందిర కేసు విచారణ రద్దు.. ఎందుకంటే?
ప్రతీకాత్మక చిత్రం(AFP)
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయోధ్య రామ మందిరం కేసు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుప్రీంలో న్యాయ విచారణ ముగిసిన తర్వాతే దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టులో ఈ నెల 29న విచారణ జరగాల్సి ఉన్న అయోధ్య రామ మందిరం కేసు వాయిదా పడింది. జస్టిస్ ఎస్ఏ బోబ్డే అందుబాటులో ఉండకపోతుండటంతో ఆరోజున కేసు విచారణను రద్దు చేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక నోటీసు విడుదల చేసింది.
చివరిసారిగా జనవరి 18న దీనిపై వాదనలు విన్న సుప్రీం.. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని వెల్లడించింది. అయితే ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదులు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ద్వారా దీనిపై విచారణ జరపాలని తర్వాత నిర్ణయించింది. సీజేఐ రంజన్ గొగొయ్‌తో పాటు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, ఎన్వీ రమణ, లలిత్, డీవై చంద్రచూడ్ ఈ బెంచ్‌లో సభ్యులుగా ఉండనున్నారు.
ప్రస్తుతం ఎస్ఏ బోబ్డే అందుబాటులో లేని కారణంగా అయోధ్య రామ మందిర కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయోధ్య రామ మందిరం కేసు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుప్రీంలో న్యాయ విచారణ ముగిసిన తర్వాతే దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
(అయోధ్య రామ మందిర కేసు విచారణ వాయిదాపై సుప్రీం విడుదల చేసిన నోటీసు..)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.