అయోధ్య రామ మందిరంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 24, 2019, 4:50 PM IST
అయోధ్య రామ మందిరంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
అయోధ్య రామమందిరం నమూనా (Image: Reuters)
  • Share this:
జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్రమంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఆదివారం జార్ఖండ్‌లోని బిశ్రమ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా జనాలు జై శ్రీరాం నినాదాలు చేశారు. ఆ అంశంపై మంత్రి స్పందించే వరకు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. దాంతో స్పందించిన రాజ్‌నాథ్.. అయోధ్యంలో రామ మందిర నిర్మాణాన్ని భూమ్మీద ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు.

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని మేం ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం. మందిర నిర్మాణం కోసం ఇప్పుడు మార్గం సుగమమైంది. రామ మందిరాన్ని ఈ భూమ్మీద ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేదు.
రాజ్‌నాథ్ సింగ్



81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్‌లో నవంబరు 30 నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 30న తొలిదశ, డిసెంబరు 7న రెండో దశ, డిసెంబరు 12న మూడో దశ, డిసెంబరు 16న నాలుగో దశ, డిసెంబరు 20న ఐదో దశ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక డిసెంబరు 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
First published: November 24, 2019, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading