అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం

రామమందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమం నిర్వహిస్తామని.. ఎక్కువ మంది జనం రాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: July 1, 2020, 4:50 PM IST
అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం
ప్రధాని మోదీ, నిత్య గోపాల్ దాస్
  • Share this:
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వడివడిగా అడగులు పడుతున్నాయి. ఇప్పటికే రామాలయం నిర్మాణానికి భూమి జరగ్గా..త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో పర్యటించాలని ప్రధాని మోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖరాసింది. రామమందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమం నిర్వహిస్తామని.. ఎక్కువ మంది జనం రాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.అయోధ్యలో పర్యటించి, రామమందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాశాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
నిత్య గోపాల్ దాస్, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు


ఆలయ నిర్మాణం కోసం మే 11న భూమిని చదును చేశారు. లాక్‌డౌన్ సడలింపు తర్వాత జూన్ 10న పునాది రాయి వేశారు. కాగా, అయోధ్యలో బాబ్రీ మసీదు, రామజన్మ భూమి వివాదంపై గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదస్పద స్థలం రామ్‌ లల్లాకే చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అటు అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని తీర్పులో పేర్కొంది. తీర్పు వచ్చిన కొన్ని రోజుల తర్వాత కేంద్రం ప్రభుత్వం.. మహంతి నిత్య గోపాల్ దాస్ అధ్యక్షతన 15 మంది సభ్యులతో రామజన్మభూమి తీర్థ కేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ బాధ్యతలను ఆ ట్రస్టే చూస్తోంది.
First published: July 1, 2020, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading