ఆ విషయంలో ట్రంప్‌కు రాజమౌళే దిక్కు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

డొనాల్డ్ ట్రంప్, రాజమౌళి (Twitter/Photo)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజమౌళి దిక్కు. ఈ విషయం అంటున్నది ఎవరో కాదు...

 • Share this:
  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజమౌళి దిక్కు. ఈ విషయం అంటున్నది ఎవరో కాదు... ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన పర్యటనకు ముందు ట్రంప్.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ సినిమాలో  తనపై యానిమేషన్ చేసిన పాటను ట్వీట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని షోలే, దిల్‌వాలే దుల్హనియా లేజాంయే సినిమాలను మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ గోపాల్ వర్మ.. ట్రంప్ భారత పర్యటనపై తనదైన శైలిలో పంచ్‌లు వేసాడు.  భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం మన దేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్విట్టర్‌లో స్పందిస్తూనే ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడిని స్వాగతం పలికేందుకు కోటి మంది ఎలా వస్తారన్నారు. అంత మంది రావాలంటే బాలీవుడ్ హీరో, హీరోయిన్లతో పాటు ట్రంప్ కూడా లైన్‌లో నిల్చోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాదు.. ట్రంప్‌కు లక్ష మంది కోటి మందిగా కనిపించాలంటే రాజమౌళి సాయం తీసుకోవాలని కాస్తంత వ్యంగ్యంగా సెటెర్లు వేసాడు.


  ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు కేవలం లక్ష మంది మాత్రమే వచ్చారంటూ తనదైన శైలిలో వ్యంగ్రాస్త్రాలు సంధించాడు.అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడంటే మన దేశ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లినపుడు కనీసం వేల రూపాయలైన ఆ దేశం వాళ్లు ఖర్చు చేసారా ? అని ఆర్జీవి ట్విట్టర్‌లో ఆసక్తికర ప్రశ్న వేశాడు.


  ట్రంప్ తన జీవితంలో ఒక్కసారైనా తన పర్యటనకు ఎక్కువ జనాలు వస్తే చూడాలనే కోరికతో ట్రంప్ మన దేశంలో పర్యటిస్తున్నారని అన్నారు. ట్రంప్ తన పర్యటనలో అసలైన భారత్ కాదని, అసలైన భారత దేశం వేరే ఉందని చెప్పేలా ఒక ఫోటోను ఆర్టీవి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘రియల్ వ్యూ ట్రంప్ వ్యూ’ అని రాసి ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఒకవైపు అభివృద్ధి చెందిన రోడ్లను సూచిస్తుంటే..మరోవైపు పేదరికాన్ని తెలియజేస్తోంది. ఒకే ఫోటోలో ఎంతో డెవలప్‌ చేసిన రోడ్లపై ట్రంప్ వెళుతుంటే.. అదే రోడ్డుకు ఇవతల వైపు మురికి వాడళ్లలోని మహిళలు కనిపిస్తున్నారంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో కొంత మంది కరెక్టే అంటే.. మరికొంత మంది ఆయనకు ఏ పని లేక ఇలా అమెరికా అధ్యక్షుడి పర్యటనపై ట్వీట్లు చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడి రాకపై చేసిన ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: