హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers protest: వారితో జాగ్ర‌త్త‌.. ఎంత‌కైనా తెగిస్తారు..: రాకేశ్ టికాయిత్

Farmers protest: వారితో జాగ్ర‌త్త‌.. ఎంత‌కైనా తెగిస్తారు..: రాకేశ్ టికాయిత్

రాకేశ్ టికాయ‌త్ (ఫైల్‌)

రాకేశ్ టికాయ‌త్ (ఫైల్‌)

Farmers' protest: రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను విడ‌గొట్టేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ఎంత దూర‌మైన వెళ్తాయ‌ని ఆయ‌న ఆరోపించారు. దేశ ప్ర‌జ‌లు వారితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అన్నారు.

ఇంకా చదవండి ...

  రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ (Rakesh Tikait) బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ (RSS)పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను విడ‌గొట్టేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ఎంత దూర‌మైన వెళ్తాయ‌ని ఆయ‌న ఆరోపించారు. దేశ ప్ర‌జ‌లు వారితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అన్నారు. ప్ర‌జ‌ల ఐక్య‌త‌ను దెబ్బ తీసేందుకు వారు ఎంత‌కైన తెగిస్తార‌ని అన్నారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు ఉద్య‌మం ప్రారంభించి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో రాకేశ్ టికాయిత్ మిడియా (Media)తో మాట్లాడారు. కేంద్ర ఇప్ప‌టికైనా దిగివ‌చ్చి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించాల‌ని లేదంటే నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

  ఏడాదిగా రైతులు (Farmers) ఆందోళ‌న‌లు చేస్తున్నా ప్ర‌భుత్వం త‌మ‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించ‌క‌పోడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏడాది అవుతున్నా రైతుల ఆవేద‌న ప‌ట్ట‌క‌పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తుంద‌న్నారు.

  IIT Recruitment 2021 : ఐఐటీ మండీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, వేత‌నం వివ‌రాలు


  ఇంత సుదీర్ఘంగా ఎప్పుడైనా దేశంలో నిర‌స‌న‌లు జ‌ర‌గ‌డం చూశారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రైతులు చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే త‌మ‌తో చ‌ర్చ‌లు ప్రారంభించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  వ‌చ్చేది చ‌లి కాలం కావ‌డంతో నిర‌స‌న‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని అన్నారు. చ‌లికి త‌ట్టుకొనేలా దుస్తులు తెచ్చుకోవాల‌ని ఆయ‌న రైతుల‌ను విజ్ఞ‌ప్తి చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిర‌స‌న ఆప‌మ‌ని తెలిపారు. హరియాణా హిసార్ జిల్లాలో బీజేపీ ఎంపీ రామ్ చంద‌ర్ జాంగ్ఆర కారుపై జరిగిన దాడిపై ఆయ‌న స్పందించారు. రైతుల్లో కొంద‌రు గూండాలు క‌లిసి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

  ఏం జ‌రిగింది..

  వ్యవసాయ చట్టాలకు వ్య తిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఎంపీ రామ్ చందర్ జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలేని తాగుబోతులే వ్య వసాయ ఆందోళ‌న చేస్తున్నార‌ని అన్నారు. దీంతో ఆంగ్ర‌హం ్య‌క్తం చేసిన రూతులు హిసార్ జిల్లాల న‌ర్నౌంద్‌లో ఆయ‌న కారును అడ్గ‌గించారు. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు కారు వాహ‌నాన్ని ధ్వ‌సం చేశారు. రైతులే దాడికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆర‌పిస్తున్నారు. కానీ రైతు సంఘం నాయ‌కులు మాత్రం తాము కాద‌ని వాదిస్తున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Farmers Protest

  ఉత్తమ కథలు