Home /News /national /

RAKESH TIKAIT ATTACK FARMERS LEADER BKU RAKESH TIKAIT ATTACKED WITH BLACK INK IN BENGALURU KARNATAKA MKS

Rakesh Tikait Attacked : రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్‌పై దాడి.. Bengaluruలో ఘటన.. Video

రాకేశ్ టికాయత్ పై దాడి దృశ్యం

రాకేశ్ టికాయత్ పై దాడి దృశ్యం

సాగు చట్టాలపై వ్యతిరేక పోరాటంలో దేశవ్యాప్తంగా పాపులరైన రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ పై సోమవారం దాడి జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహిస్తోన్న ఆయనపై నిరసనకారులు ఇంకు చల్లారు. రెండు వర్గాల మద్య గొడవ జరిగింది..

ఇంకా చదవండి ...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా వేల మంది రైతులు ఏడాదిపాటు నిర్వహించిన ఉద్యమానికి ముఖచిత్రంగా పాపులరైన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ పై దాడి జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో సోమవారం నాడు ఆయనపై కొందరు ఇంకుతో దాడి చేశారు. రైతు సంబంధిత అంశాలపై ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, నిరసనకారులో లోనికి దూసుకొచ్చి టికాయత్ ముఖంపై ఇంకు చల్లారు. (Rakesh Tikait Attacked With Black Ink)

ఇంకు దాడితో షాకైన రైతు సంఘాల ప్రతినిధులు.. దాడి చేసినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తీవ్ర గలాటా చోటుచేసుకుంది. ప్రధాని పేరును నినాదంగా పలుకుతూ ఒకరిపై ఒకరు కుర్చీలు విరుసురుకొని ముష్టిఘాతాలకు దిగడంతో అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది. ఇంకు నిండిన ముఖంతోనే రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు స్థానిక పోలీసులదే బాధ్యతని ఆరోపించారు.

బెంగళూరులో రాకేశ్ టికాయత్ పై ఇంకు దాడి

CM KCR | Akunuri Murali : కాళేశ్వరం ప్రాజెక్టు మూసేయక తప్పదు : ఎందుకో చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..





బెంగళూరు పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్న రాకేశ్ టికాయత్.. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలనే కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారని అన్నారు. ఒక స్టింగ్ ఆపరేషన్‌లో రైతు నాయకుడు ఒకరు డబ్బు అడుగుతూ కెమెరాకు చిక్కారంటూ వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు టికాయత్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడినవారు మోదీ నినాదాలు చేయడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

ఇంకు దాడి తర్వాత మీడియాతో రాకేశ్ టికాయత్

Rakesh Tikait | BKU : రాకేశ్ టికాయత్‌కు షాక్.. రాజకీయ ధోరణిపై సంఘంలో తిరుగుబాటు.. బీకేయూలో చీలిక..


కాగా, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీలతో అంటకాగడంపై ఆయన సొంత సంఘమైన బీకేయూలోనే మెజార్టీ నేతలు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. టికాయత్ తీరుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని పేరున్న బీకేయూ రెండుగా చీలిపోయింది. బీకేయూలో కీలక నేతలుగా ఉన్న తికాయత్‌ సోదరులు రాకేశ్‌, నరేశ్‌ తీరును వ్యతిరేకిస్తూ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ సింగ్‌ చౌహాన్‌ వేరు కుంపటి పెడుతున్నట్లు కొద్ది వారాల కిందట ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే టికాయత్ పై దాడి చోటుచేసుకోవడం గమనార్హం.
Published by:Madhu Kota
First published:

Tags: Attack, Bengaluru, Farmers, Farmers Protest, Karnataka

తదుపరి వార్తలు