ఓబీసీ జాబితాలను ఖరారు చేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఓబీసీ కులాల జాబితాను రూపొందించుకునే అధికారం రాష్ట్రాలకే దక్కుతుంది. అంతకుముందు ఓబీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ బిల్లుకు నిన్న లోక్సభ ఆమోదం తెలపడంతో.. నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా నేడు జరగాల్సిన ప్రశ్నోత్తరాలు, భోజన విరామ సమయాన్ని రద్దు చేశారు.
బిల్లును ఎవరూ వ్యతిరేకించడంలేదని, చర్చ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించినా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. దీంతో నాలుగు గంటల పాటు ఈ అంశంపై చర్చ చేపట్టనున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఓబీసీ బిల్లును సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ చేప్టటేందుకు ఏకగ్రీవంగా అంగీకరించిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదో చరిత్రాత్మక బిల్లు అని అన్నారు. ఈ బిల్లు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఊతమిస్తుందని అన్నారు. దేశంలోని ఐదో వంతు ఓబీసీలకు ఈ బిల్లు కారణంగా లాభం కలుగుతుందని అన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.