హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Parimal Nathwani: మృగరాజుకు అండగా పరిమళ్ నత్వానీ... గిర్ అడవుల్లో సింహాల సంరక్షణ

Parimal Nathwani: మృగరాజుకు అండగా పరిమళ్ నత్వానీ... గిర్ అడవుల్లో సింహాల సంరక్షణ

మృగరాజుకు అండగా పరిమళ్ నత్వానీ... గిర్ అడవుల్లో సింహాల సంరక్షణ
(image: Screengrab/youtube)

మృగరాజుకు అండగా పరిమళ్ నత్వానీ... గిర్ అడవుల్లో సింహాల సంరక్షణ (image: Screengrab/youtube)

Parimal Nathwani | గిర్ అడవుల్లోని సింహాల ప్రాణాలను కాపాడేందుకు, వాటిని సంరక్షించేందుకు రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ ఎంతో కృషి చేస్తున్నారు. మృగరాజుకు అండగా నిలుస్తున్నారు.

పరిమళ్ నత్వానీ... పరిచయం అక్కర్లేని ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభకు గతేడాది ఎన్నికయ్యారు. అంతకుముందు రెండుసార్లు ఝార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ ఆయన గురించి అందరికీ తెలిసినవే. కానీ ఆయన గిర్ అడవుల ప్రేమికుడు అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు. గిర్ అడవుల్లోని సింహాలంటే ఆయనకు ప్రాణం. ప్రకృతిలోని ఎన్నో అద్భుతాలు ఎందరినో ఆకర్షిస్తుంటాయి. కానీ కొందరు మాత్రమే ప్రకృతిని, ప్రకృతిలోని జంతువుల్ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం మాత్రమే కాదు... వాటిని కాపాడేందుకు కష్టపడుతుంటారు. పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీ కూడా అలాంటి దారిలో నడుస్తున్నారు.

గిర్ అడవులు అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వచ్చి రీఛార్జ్ అయి వెళ్తాను. అప్పట్లో నా దగ్గర పెద్దగా డబ్బులు కూడా ఉండేవి కావు. బస్సులో వచ్చాను. రైలులో వచ్చాను. ట్యాక్సీలో వచ్చాను. ఇక్కడే టీస్టాల్ దగ్గర ఛాయ్ తాగుతూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా గిర్ అడవులకు వస్తుంటారు. 35 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నాను. అప్పుడు పెద్దగా ఏర్పాట్లు కూడా ఉండేవి కావు. టెలిఫోన్ సౌకర్యం కూడా ఉండేది కాదు. ఇక్కడివాళ్లతో కలిసి గిర్ అడవుల్లో తిరిగేవాడిని. చాలా బాగా అనిపించేది. ఇక్కడికి వస్తే స్వర్గానికి వచ్చినట్టు ఉంటుంది.

పరిమళ్ నత్వానీ, రాజ్యసభ ఎంపీ

గిర్ అడవుల గుండా వెళ్లే రైళ్ల కారణంగా ఇక్కడి సింహాలు, ఇతర జంతువులు రైలు పట్టాలపై చనిపోతూ ఉండేవి. గాయపడుతూ ఉండేవి. ఇలాంటి ఘటనలు పరిమళ్ నత్వానీని బాగా కలచివేశాయి. ఏదైనా చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. మూగజంతువలను కాపాడాలని కోరారు. గిర్ అడవుల్లోని సింహాలను రక్షించేందుకు అనేక చర్యలు తీసకున్నారు. అందుకే గిర్ ప్రాంతానికి పరిమళ్ నత్వానీ వస్తే ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉంటారు. గిర్ అడవులు, ఇక్కడి సింహాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తారని పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త రోహిత్ వ్యాస్ చెబుతున్నారు.

' isDesktop="true" id="1047160" youtubeid="pKgBQ9_JoXA" category="national">

గిర్ అడవులకు వచ్చినప్పుడల్లా ఇక్కడి సింహాలను చూసి అద్భుతం అని ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు... ఆ సింహాల ప్రాణాలు కాపాడేందుకు అనేక చర్యల్ని తీసుకుంటున్నారు పరిమళ్ నత్వానీ. సింహాలు బావుల్లో పడి చనిపోయిన ఘటనలో అనేకం ఉన్నాయి. ఈ ఘటనలు ఆయను బాధించాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకున్నారు. సింహాలు బావుల్లో పడి మరణించకుండా అడ్డుకోవడం నుంచి సాసాన్ గిర్‌లో సింహాలకు అత్యాధునిక ఆస్పత్రి ఏర్పాటు చేసేంత వరకు సింహాలను కాపాడే ప్రతీ విషయంలో పరిమళ్ నత్వానీ ఎల్లప్పుడూ ముందే ఉంటున్నారు.

సింహాలు, వాటి పిల్లలు పగలు కింద చూసుకుంటూ నడుస్తాయి. కానీ రాత్రి సమయంలో పైకి చూసి నడుస్తుంటాయి. రాత్రి సమయంలో సింహాలు బావుల్లో పడి చనిపోవడానికి అదే కారణం. చీకట్లో బావులు, గుంతలు కనిపించవు. అందుకే మేము రిలయెన్స్‌తో కలిసి ఓ కార్యక్రమం చేపట్టాం. సింహాలు, వాటి పిల్లలు బావుల్లో, గుంతల్లో పడకూడదని బావుల చుట్టూ ఎత్తైన గోడలు కట్టాం. గతంలో ఇక్కడ సింహాలకు డాక్టర్లు అందుబాటులో ఉండేవారు కాదు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఇక్కడ సింహాల కోసం ఆస్పత్రి వచ్చింది.

పరిమళ్ నత్వానీ, రాజ్యసభ ఎంపీ

మృగరాజు అయిన సింహాలు తన సొంత పిల్లలు అని పరిమళ్ నత్వానీ చెబుతున్నారు. మరో 3,000 బావుల చుట్టూ గోడలు కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన 'గిర్ లయన్-ప్రైడ్ ఆఫ్ గుజరాత్' పుస్తకం కూడా రాశారు. నవాబుల సమయంలో కేవలం 20 సింహాలు మాత్రమే గిర్ అడవుల్లో ఉండేవి. ఇప్పుడు 700 సింహాలు ఉన్నాయి. గిర్ అడవులు ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో గిర్ అడవులు, అక్కడి సింహాలకు సంబంధించిన గ్యాలరీ ఏర్పాటు చేశారు పరిమళ్ నత్వానీ. సింహాలకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టబోతున్నామన్నారు.

First published:

Tags: Lions, Parimal Nathwani

ఉత్తమ కథలు