Home /News /national /

RAJYA SABHA WE ARE NOT SAVARKAR TO APOLOGIZE SUSPENDED MPS IN THE RAJYA SABHA EVK

Rajya Sabha: క్షమాపణ చెప్పడానికి మేం సావర్కర్ కాదు: రాజ్యసభలో సస్పెండైన‌ ఎంపీలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Rajya Sabha: విపక్ష ఎంపీలు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టగా, వారి తీరు అనుచితంగా, హింసాత్మక ఉందంటూ మొత్తం 12 మంది ఎంపీలపై వేటు పడింది. సస్పెన్షన్ ఎత్తేయాలంటే సభకు సారీ చెప్పాలని కేంద్రం సూచించగా, అందుకు విపక్షాలు నిరాకరిస్తూ ప‌లు వ్యాఖ‌లు చేశాయి.

ఇంకా చదవండి ...
  పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliment Winter Session) రెండోరోజైన మంగళవారం కూడా అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగింది. సాగు చట్టాల రద్దు బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వం ఆమోదించుకోవడంపై నిరసన వ్యక్తం చేసిన వారిలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన వ్యవహారంపై రాజ్యసభ (Rajya Sabha) లో ఇవాళ లొల్లి జరిగింది. సోమవారం  రాజ్యసభలో సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం సందర్భంలో విపక్ష ఎంపీలు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టగా, వారి తీరు అనుచితంగా, హింసాత్మక ఉందంటూ మొత్తం 12 మంది ఎంపీలపై వేటు పడింది. సస్పెన్షన్ ఎత్తేయాలంటే సభకు సారీ చెప్పాలని కేంద్రం సూచించగా, అందుకు విపక్షాలు నిరాకరించాయి. ఈ సంద‌ర్భంగా పీటీఐ (PTI) వ‌ర్గాలు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం. సభను సక్రమంగా నిర్వహించకుండా, వారి దుష్ప్రవర్తనకు పశ్చాత్తాపపడకుండా సస్పెన్షన్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu) స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.

  దీనిపై క‌మ్యూనిస్ట్ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం మాట్లాడారు. మేము క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌సక్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. క్షమాపణ చెప్పడానికి మేం సావర్కర్ కాదు. క్షమాపణలు చెప్పి లేఖలు రాయడం మన సంస్కృతి కాద‌న్నారు. ఈ ప్ర‌భుత్వం పార్లమెంటరీ విధానాన్ని మరియు ప్రతిపక్షాన్ని చిన్నచూపు చూసే ప్రభుత్వం అన్నారు.

  Sirivennela Seetharama Sastry: ప్ర‌తీ పాటలో ఓ చెమ‌క్కు.. "సిరివెన్నెల" ఆణిముత్యాలు ఎన్నో


  ఇది ప్రతిపక్షం అవసరం లేదని నమ్మే ప్రభుత్వం అని విమ‌ర్శించారు. మేము వారి ముందు వంగి ఉండమ‌ని అన్నారు. ఈ చర్యను సవాలు చేసేందుకు న్యాయపరమైన మార్గాలను కూడా పరిశీలిస్తామని చెప్పారు. అయితే, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్ ఈ వ్యాఖ్యల‌కు దూరంగా ఉన్నారు.

  రాహుల్ గాంధీ ట్వీట్‌..
  ‘‘ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తినందుకు దేనికి క్షమాపణ చెప్పాలి? ఎన్నటికీ కాదు’’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హిందీలో ట్వీట్ చేశారు. నవంబర్ 29, 2021 సోమవారం మొత్తం శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయబడిన 12 మంది ఎంపీలలో ఆరుగురు కాంగ్రెస్‌, ఇద్దరు టిఎంసి, ఇద్ద‌రు శివసేన ఒక్కొక్కరు మరియు సిపిఐ(ఎం), సిపిఐ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

  గత వర్షాకాల సమావేశాల చేదు అనుభవం మనలో చాలా మందిని వెంటాడుతూనే ఉందని వెంకయ్య చెప్పారు. ఇదిలావుంటే, తాము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, స‌భ‌లో క్షమాప‌ణ‌లు చెప్పే ప్రస‌క్తే లేద‌ని స‌స్పెండైన ఎంపీలు తెగేసి చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారని‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.

  సాగు చట్టాలను ప్రవేశపెట్టిన సందర్భంలో, మళ్లీ వాటిని రద్దు చేసిన సందర్భంలోనూ కనీస చర్చ చేపట్టకపోవడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగాలన్నందుకు ఎంపీలను సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డ విపక్ష నేతలు.. సారీ చెప్పే ప్రశ్నే ఉత్పన్నంకాబోదన్నారు. సస్పెన్షన్ ఎత్తేయాలనే డిమాండ్ ను చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా తిరస్కరించడంతో విపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bjp, Congress, Parliament Winter session, Rajya Sabha, Venkaiah Naidu

  తదుపరి వార్తలు