రాజ్యసభ ఎన్నికల ఫలితాలు... ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు?

(ప్రతీకాత్మక చిత్రం)

Rajya Sabhe Elections Updates | ఏడు రాష్ట్రాల్లో 18 సీట్లకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏయే రాష్ట్రంలో ఎవరెవరు విజయం సాధించారో తెలుసుకోండి.

  • Share this:
    Rajya Sabha Election Live Updates | దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 4, గుజరాత్ 4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్ 3, జార్ఖండ్ 2, మేఘాలయ 1, మిజోరాం 1 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం నాలుగు సీట్లను వైసీపీ గెలుచుకుంది. వైసీపీ నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన వర్ల రామయ్య ఓటమిపాలయ్యారు. గుజరాత్‌లో నాలుగు సీట్లకు గాను బీజేపీ మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సీటు దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థులు అభయ్ భరద్వాజ్, రమిలా బారా, నరహరి అమిన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శక్తిసింగ్ గోహిల్ గెలుపొందారు.

    ఇక మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 2, కాంగ్రెస్ 1 సీటు గెలిచాయి. బీజేపీ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, సుమేర్ సింగ్ సోలంకి, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్‌‌లో మూడు సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ 1 సీటు గెలిచాయి. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, నీరజ్ దాంగి విజయం సాధిస్తే, బీజేపీ తరఫున రాజేంద్ర గెహ్లోత్ గెలుపొందారు. జార్ఖండ్‌లో రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 1, జేఎంఎం మరొకటి గెలుచుకున్నాయి. జేఎంఎం అధ్యక్షుడు శిబు సొరెన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ ప్రకాష్ విజయం సాధించారు. మేఘాలయలో ఒక్క సీటును నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి ఖార్లూకీ ఎన్నికయ్యారు. మిజోరాంలో ఒక్క సీటును మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి కె.వన్లాల్‌వేన దక్కించుకున్నారు.

    First published: